కొత్త సినిమా అప్డేట్.. ‘RED’ను మించేలా రామ్ భారీ ప్లాన్
ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ ప్రస్తుతం భారీ ప్లాన్‌ను వేసినట్టు కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ మసాలా సినిమా తీసిన రామ్.. ఆ తరువాత జానర్ మార్చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ అయినా రెడ్ సినిమాను పట్టాలెక్కించాడు. అది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సారి కూడా కొత్త జానర్‌ను ప్రయత్నంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. తెలుగు, తమిళ దర్శకులతో రామ్ చర్చలు జరుపుతున్నట్టు టాక్.
సంక్రాంతి బరిలో దిగిన RED సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి మూడు నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాలన్నింటిల్లో కెల్లా హయ్యస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా RED రికార్డు సృష్టించింది. అయితే RED సాధించిన విజయంతో రామ్ తదుపరి ప్రాజెక్ట్‌పైనా అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు రామ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ రాబోతోంది.

మొన్నీమధ్యే రామ్ స్వామి మాల వేసుకుని దర్శనమిచ్చాడు. కొన్ని రోజులు సినిమాలకు గుడ్ బై అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రామ్ 19వ సినిమాకు సంబంధించిన ప్రకటన రేపు రాబోతోందని ప్రకటించేశారు. అయితే తమిళ దర్శకుడితో రామ్ ప్రాజెక్ట్ ఉండబోతోందనే టాక్ వస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











