రెండు మిలియన్ల మంది.. అందుకే ఈ స్టిల్ అంటోన్న రామ్!!
ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ తాజాగా సోషల్ మీడియాలో అదిరిపోయే స్టిల్ ఒకటి షేర్ చేశాడు. రామ్ సోషల్ మీడియాలో కాసింత పద్దతిగా, స్లోగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అవసరమైతే గానీ స్పందించడు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే స్పందిస్తుంటాడు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటాడు. అయితే ఆ మధ్య స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.
ఆ విషయాలన్ని కాసేపు పక్కనపెడితే.. రామ్ తాజాగా వార్తల్లోకి ఎక్కాడు. అభిమానులు తనపై కురిపించిన, కురిపిస్తోన్న ప్రేమకు ఎలా సమాధానం ఇవ్వాలో, ఎం చెప్పాలో తెలియక ఈ ఫోటోను షేర్ చేస్తున్నా అని తెలిపాడు. తాజాగా రామ్ తన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య రెండు మిలియన్లకు చేరుకోవడంతో ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు స్పందిస్తూ.. నా రెండు మిలియన్ల ఇన్‌స్టా ఫ్యామిలీకి ఏం చెప్పాలో తెలియక నా ఫోటోను షేర్ చేస్తున్నా అని తెలిపాడు.

ఆ షర్ట్ బటన్ తీసేసి ఉండటం, జుట్టును అలా పట్టుకోవడం, టై అలా చిందరవందరగా ఉండటంతో ఓ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. మీరు చూపించిన చూపిస్తున్న ప్రేమకు పిచ్చెక్కిపోతోందని పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా రామ్ స్టిల్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే రామ్ తన RED చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశాడు. ఇక ఈ మూవీ థియేటర్లో సందడి చేసేందకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











