డివోషనల్ లుక్‌తో షాకిచ్చిన రామ్: స్మాల్ బ్రేక్.. త్వరలోనే వచ్చేస్తా అంటూ పోస్ట్
బడా నిర్మాత ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనలోని టాలెంట్‌ను బయట పెడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే, మధ్యలో పలు పరాజయాలను చవి చూడడంతో నిరాశకు లోనయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇది రామ్ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలవడంతో పాటు అతడితో ఉత్సాహాన్ని నింపింది.
పడక గదిలో సీన్‌లో రెచ్చిపోయిన అప్సర రాణి.. హాట్ హాట్ ఫోటోలు మీ కోసం
'ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని నటించిన చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సొంత బ్యానర్‌లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇందులో హీరోయిన్లు మాళవిక, నివేదా పేతురాజ్, అమృత అయ్యర్‌లు నటించారు. అలాగే, రామ్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రభినయం చేశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. కెరీర్‌లో మొదటిసారి అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండానే 'రెడ్' మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. తద్వారా దాదాపు రూ. 20 కోట్ల వరకూ అందుకుని సత్తా చాటింది. వరుస విజయాలు ఇచ్చిన జోష్‌లో ఉన్నప్పటికీ రామ్.. తన తదుపరి సినిమాను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇలాంటి సమయంలో అతడు శివుడి మాల వేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరో.. 'ఓం నమ: శివాయా.. చిన్న విరామం.. త్వరలోనే వచ్చేస్తాను' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











