వెండితెరను ఎరుపెక్కించేందుకు హీరో రామ్ రెడీ.. రేపే రెడ్ ఓపెనింగ్‌తో..
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరో సినిమాతో సిద్ధమయ్యాడు. మలయాళ మూవీ సినిమా ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి ఇటీవల రెడ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభించింది. ఇక తాజా సినిమాను బుధవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
రెడ్ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం ఉదయం 10.18 గంటలకు సినీ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో జరుగనున్నది. పూజా కార్యక్రమాలను సంప్రదాయ పద్దతుల్లో నిర్వహించి నవంబర్ 16వ తేదీ నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిసింది.

స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బాక్స్ బద్దలు చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రానికి పీటర్ హెయిన్స్ స్టంట్స్ కోరియోగ్రఫి చేస్తున్నారు.
మలయాళంలో రూపొందిన ఓ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమారం రేపింది. భారీగా వసూళ్లను సాధించిన దక్షిణాదిలో క్రేజీగా నిలిచింది. దాంతో ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి స్రవంతి రవికిషోర్ దక్కించుకొన్నట్టు సమాచారం. రామ్ బాడీలాగ్వేంజ్‌కు సరిపోయే విధంగా ఆయనను రంగంలోకి దించారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్ యాప్ట్ సబ్జెక్ట్ అని బలంగా విశ్వసిస్తున్నట్టు తెలసింది. హీరోయిన్ల ఎంపిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తామని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వ్యక్తం చేసింది. ఈ చిత్రం ఓ హాట్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా రికార్డు స్థాయి లాభాలను రాబట్టింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు సుమారు 90 కోట్లకపైగానే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూరి కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. హీరో రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











