హీరో రామ్ కెరీర్‌లో సెన్సేషనల్ రికార్డు.. 7 భాషల్లో RED మూవీ రిలీజ్
ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ విజయం తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రం RED. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలువడంతో RED సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంఫై 'స్రవంతి' రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో రామ్ సరసన అందాల భామలు మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక ప్రకటనను విడుదల చేసింది.

కెరీర్‌లో తొలిసారి డ్యూయల్ రోల్
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ... RED మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్నది. రామ్ తన కెరీర్‌లో డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఇది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది అని తెలిపారు.

ఏడు భాషల్లోకి రామ్ సినిమా
హీరో రామ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని RED మూవీని ఏడు భాషల్లోకి అనువదించాం. కన్నడ, ,మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ, తమిళంతోపాటు హిందీ లోకి కూడా డబ్ చేశాం. కన్నడ వెర్షన్ ఈ నెల 14 తేదీన విడుదల కానున్నది. మిగిలిన భాషల్లో ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటిటిలో విడుదల చేస్తున్నాం. రామ్ కి ఇతర భాషల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నిర్మాత స్రవంతి రవి కిషోర్ తెలిపారు.
నాగ్ హీరోయిన్ అందాల ఆరబోత.. మళ్లీ తెరపైన మెరిసిన తార

ఓవర్సీస్‌లో విడుదలకు ప్లాన్
తెలుగు వెర్షన్ RED మూవీని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ద్వారా ఓవర్సీస్‌లో కూడా విడుదల చేస్తున్నాం. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయిలో రిలీజ్ చేస్తున్నాం. వసూళ్ల కోణంలో కాకుండా ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయా ఏరియాల పరిస్థితుల్ని బట్టి కొన్ని చోట్ల విడుదల చేస్తున్నాం. ఇంకొన్ని థియేటర్లు పెంచమని అడుగుతున్నారు. ఏది ఏమైనా 'రెడ్'చిత్రం ఈ సంక్రాంతికి మంచి అనుభూతిని అందిస్తుంది" అని రవి కిషోర్ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు
దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్
సమర్పణ: కృష్ణ పోతినేని
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్ ప్రకాష్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: జునైద్
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్,
రిలీజ్ డేట్: 2021-01-14


Click it and Unblock the Notifications











