Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
The WARRIOR: రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టిన రామ్.. బాలీవుడ్‌లోనూ మనోడి హవా
చాలా కాలం పాటు సరైనా విజయాన్నిఅందుకోవడంలో విఫలం అయినా.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్‌ను ఎక్కాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. మాస్ మసాలా బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ విజయాన్ని అందించడమే కాదు.. భారీ కలెక్షన్లను కూడా రాబట్టి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. అప్పటి నుంచి యమ ఉత్సాహంతో కనిపిస్తోన్న రామ్.. ఆ వెంటనే 'రెడ్'తో మరో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌తోనే మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ యంగ్ హీరో కోలీవుడ్ డైరెక్టర్ లింగు సామీతో ఓ సినిమాను పట్టాలెక్కించేశాడు.
మళ్లీ బికినీలో రచ్చ చేసిన పూజా హెగ్డే: ఈ సారి తడిచిన అందాలతో అంతకు మించి!
రామ్ నటిస్తోన్న 19వ సినిమాగా తెరకెక్కుతోన్న దీన్ని చాలా రోజుల క్రితమే ప్రకటించినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అంతేకాదు, వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా పూర్తి చేసుకున్నారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి 'ద వారియర్' అనే టైటిల్‌ను పెట్టారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో రామ్ స్టైలిష్ అండ్ పవర్ఫుల్ కాప్ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి. అంతేకాదు, ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే చాలా మంది బయ్యర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రీమేక్, డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం చాలా సంస్థలు ప్రయత్నాలు కూడా జరుపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బుచ్చిబాబు సినిమాలో కోచ్‌గా ఎన్టీఆర్: కథ, హీరోయిన్‌తో పాటు ముఖ్యమైన వివరాలన్నీ లీక్
హీరో రామ్ పోతినేనికి ఉత్తరాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతడు నటించిన ప్రతి సినిమానూ హిందీలోకి కూడా డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు. వాటికి భారీ స్థాయిలో స్పందన కూడా దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ద వారియర్' మూవీ హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ఏకంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. రామ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఫలితంగా రిలీజ్‌కు ముందే 'వారియర్' అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.
'ద వారియర్' మూవీలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అలాగే, సీనియర్ నటి నదియా కూడా ఇందులో కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేస్తారని అంటున్నారు.