For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Warrior: రామ్ పోతినేని పవర్ఫుల్ మూవీ టీజర్ రెడీ.. డేట్ ఫిక్స్!

    |

    టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి అతను తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో రామ్ పోతినేని మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కెరీర్లోనే ఆ సినిమాతో రామ్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఐతే అందుకుంది.

    మొత్తానికి ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ అందించడంతో రామ్ పోతినేని తదుపరి సినిమాలతో మరింత భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలని అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అతను లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో రామ్ మొత్తంగా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది.

    Ram pothineni the warrior movie powerful teaser release date fix

    ఇక సినిమాకు మ్యూజిక్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలలో ఇప్పటికే ఒక లిరికల్ సాంగ్ విడుదలైంది. బుల్లెట్ బైక్ పాట మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒకే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు లింగు స్వామి ఒక తెలుగు హీరోతో సినిమా చేయాలి అని ఎప్పటినుంచో అని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా అతనికి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి మాస్ కమర్షియల్ సినిమాలను అందించనున్నట్లుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను మే 14వ తేదీన సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. రామ్ పోతినేని ఆ పోస్టర్ లో బుల్లెట్ బైక్ పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ అయితే మంచి బజ్ క్రియేట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమా రామ్ పోతినేని కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందిస్తుంది అని అనిపిస్తోంది.

    ఇక ఈ సినిమాను జూలై 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల కారణంగా మధ్యలో షూటింగ్ కు కాస్త బ్రేక్ లు పడ్డాయి. ఇక ఫైనల్ గా ఇప్పుడు జూన్ 14వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా అనంతరం రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే

    English summary
    Ram pothineni the warrior movie powerful teaser release date fix
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X