కీలక విషయం లీక్ చేసిన రామ్ పోతినేని: కొత్త సినిమా కోసం కారులోనే అలా

కొంత కాలంగా వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో చేసే ప్రాజెక్టు కూడా ఉంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ చిత్రం.. అతి త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాలోని పాటల గురించి హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. తద్వారా తన మూవీలోని సాంగ్ ట్యూన్‌ను వివరాలను స్వయంగా లీక్ చేసుకున్నాడు.

రామ్ పోతినేని.. లింగుసామీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అతడు ఈ సినిమా కోసం ఓ లవ్ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు. దాన్ని హీరో రామ్‌కు సెండ్ చేయగా.. అతడు కారులోనే దాన్ని వింటున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోనే అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో RAPO19 లవ్ సాంగ్ అని రాసి ఉంది. ఈ పోస్టుకు రామ్ 'దేవీ శ్రీ ప్రసాద్ ఫైర్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఈ సినిమాలోని ఆల్బమ్‌పై అంచనాలను అప్పుడే పెంచేశాడు.

Ram Pothineni Tweet about Lingusamy Movie song

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నారు. ఇందులో రామ్ పోతినేని రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X