Happy Birthday Boyapati Sreenu: ఊర మాస్ దర్శకుడికి.. రామ్ యూనిట్ స్పెషల్ విషెస్!

ఊర మాస్ దర్శకుడు అంటే ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ఒకే ఒక బలమైన పేరు బోయపాటి శ్రీనివాస్. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ప్రేక్షకులకు ఒక ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అని చెప్పవచ్చు. భద్ర సినిమా నుంచి సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బోయపాటి శ్రీను రీసెంట్ గా అఖండ సినిమాతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అతనితో సినిమా చేస్తే తప్పకుండా హీరో కు మాస్ ఆడియెన్స్ మరింత దగ్గరవుతారు అని చాలా క్లారిటీ గా చెప్పవచ్చు. ఇక నేడు బోయపాటి శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు అలాగే మాస్ ప్రేక్షకులు అందరూ కూడా అతనికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బోయపాటి శ్రీను కు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ మాస్ దర్శకుడికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రామ్ పోతినేని సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు కూడా బోయపాటి శ్రీను కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బోయపాటి శ్రీను తన తదుపరి సినిమా రామ్ పోతినేని తో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు పూర్తి స్క్రిప్టు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

ram pothineni unit special wishes to mass director boyapati sreenu

మరోవైపు రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు లింగస్వామి రామ్ పోతినేని తో ది వారియర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఆ సినిమాను ఒకేసారి తమిళంలో తెలుగులో షూట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్ హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ కు కూడా మంచి స్పందన లభించింది. తప్పకుండా సినిమా ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది అని మొదటి పాట తోనే అర్థమైంది.

ఇక ది వారియర్ సినిమా తర్వాత రామ్ పోతినేని పూర్తిగా బోయపాటి శ్రీను సినిమాతోనే బిజీ కానున్నాడు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అఖండ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఆ సినిమాకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X