The Warrior: రామ్ పోతినేని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక సిద్ధం.. డేట్ ఫిక్స్
యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై మాస్ ప్రేక్షకులలో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తమిళ ప్రముఖ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ అయితే రెండు భాషల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రామ్ పోతునేని రెండు భాషల్లో కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
చెన్నైలో ఎక్కడికి వెళ్లినా కూడా అతనికి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతోంది. దీంతో ది వారియర్ సినిమా అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. దానికి తోడు లింగస్వామికి అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో ది వారియర్ సినిమా కోసం తమిళపేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

వేదికతో పాటు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ది వారియర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు జేఆర్సి కన్వెన్షన్ లో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు రామ్ పోతినేని అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా విడుదలైన ది వారియర్ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. రెండు భాషల్లో కూడా సినిమాకు భారీ స్థాయిలోనే హైప్ క్రియేట్ అయింది. తప్పకుండా రామ్ తన కెరీర్ మొత్తంలోనే దివారియర్ సినిమాతో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటాడు అని కూడా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మెయిన్ హీరొయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











