మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
మొదట్లో చాక్లెట్ బాయ్ గా పిలిపించుకున్న రామ్ పోతినేని అప్పట్లో ఎక్కువగా లవ్ స్టోరీస్ తోనే హిట్స్ కొట్టడు. ఇక కందిరీగ నుంచి ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో బాగానే క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ వలన మాస్ ఆడియెన్స్ కు చాలా దగ్గరయ్యాడు. రెడ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.
అయితే రెడ్ సినిమాలో కూడా రామ్ ఉస్తాద్ అని ట్యాగ్ తీసుకున్న తీరు చూస్తుంటే మనోడు పూర్తిగా మాస్ ఆడియెన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రెడ్ సినిమాలో కూడా మాస్ యాంగిల్స్ ను గట్టిగానే హైలెట్ చేశారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మాస్ సినిమాను సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.

విజయ్ సేతుపతి, మోహన్ లాల్ వంటి స్టార్స్ తో జిల్లా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు RT నెసోన్, రీసెంట్ గా రామ్ ను కలిసినట్లు టాక్. జిల్లా సినిమా తమిళ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇటీవల ఆ దర్శకుడు రామ్ కు ఒక కథ చెప్పినట్లు సమాచారం. పూర్తిగా మాస్ గా ఉండడంతో రామ్ కు ఆ స్క్రిప్ట్ కూడా బాగా నచ్చేసిందట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్. మరి ఆ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











