విశాల్ బీరు బాటిల్‌పై మొదలైన రచ్చ.. వివాదంలో టెంపర్ రీమేక్!
హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం అయోగ్య. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తెలుగు సూపర్ హిట్ చిత్రం టెంపర్ చిత్రానికి ఇది రీమేక్. ఎన్టీఆర్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి మాస్ అంశాలతో పాటు చక్కటి సందేశాన్ని కూడా అందించింది. ఈ చిత్రాన్నితమిళ రీమేక్ లో విశాల్ నటిస్తుండగా, హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు.
ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. చేతిలో బిరుబాటిల్ పట్టుకుని, జీపుపై కూర్చుని ఉన్న విశాల్ లుక్ యువతని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ లుక్ విషయంలో వివాదం కూడా మొదలైంది. విశాల్ చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని ఉండడాన్ని పలువురు ప్రముఖులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పీఎంకే పార్టీ అధినేత రాందాస్ విరుచుకుపడుతున్నారు.

విశాల్ నటుడిగా, నిర్మాతల మండలి చైర్మన్ గా భాద్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి చేతిలో బీరు బాటిల్ పెట్టుకుని కనిపిస్తే యువతకు ఎలాంటి సంకేతాలు వెళతాయి అని ఆయన మండిపడుతున్నారు. రాందాస్ పోరాటం ఇప్పటిది కాదు. చాలా కాలంగా సినిమాలో మద్యపానం, దూమపానం సన్నివేశాలు చూపించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారు. రాందాస్ విమర్శలకు విశాల్ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











