నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది: టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్ రికార్డ్

పేరుకు బడా ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ... స్వశక్తితోనే స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని సత్తా చాటిన అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం RRRలో నటిస్తోన్న తారక్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టాలీవుడ్‌‌లోనే నెంబర్ వన్ హీరోగా ఘనతను సాధించాడు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు

వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు

కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘టెంపర్' నుంచి ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టాలీవుడ్ హీరోల్లో టాప్ పొజిషన్‌కు చేరువ కావడంతో పాటు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్.

మెగా హీరోతో మల్టీస్టారర్ మూవీ... భీం పాత్ర

మెగా హీరోతో మల్టీస్టారర్ మూవీ... భీం పాత్ర

ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి' తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

RRR కోసం కష్టపడుతోన్న నందమూరి హీరో

RRR కోసం కష్టపడుతోన్న నందమూరి హీరో

ఎన్టీఆర్ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి RRR మూవీపైనే అతడు ఫోకస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తన టాలెంట్ చూపించాలన్న పట్టుదలతో ఉన్న యంగ్ టైగర్.. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తూ కష్ట పడుతున్నాడు. అలాగే, అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

గతంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ‘భీమ్ ఫర్ రామరాజు'ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఆ తర్వాత అంటే ఇటీవల ‘రామరాజు ఫర్ భీం' పేరిట జూనియర్ ఎన్టీఆర్ పరిచయ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా బాగానే సెట్ అయింది.

రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటిన భీం

రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటిన భీం

‘రామరాజు ఫర్ భీం' వీడియో అప్‌లోడ్ చేసిన సమయం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్రను తిరగరాసింది. అలాగే, ఓవరాల్‌గా ఎక్కువ వ్యూస్ అందుకున్న తెలుగు టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. వీటితో పాటు ఒక మిలియన్‌కు పైగా లైకులు సాధించిన మొదటి టీజర్‌గానూ ఇది మరో ఘనతను అందుకుంది.

టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్

టాలీవుడ్‌లోనే నెంబర్ వన్ హీరోగా ఎన్టీఆర్

వేగంగా ఒక మిలియన్ లైకులు సాధించిన టీజర్‌గా.. వేగంగా మిలియన్ వ్యూస్ అందుకున్న వీడియోగా ‘రామరాజు ఫర్ భీం' సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే గతంలో మరే వీడియోకూ దక్కని విధంగా దీనికి ఒక మిలియన్ కామెంట్లు కూడా వచ్చాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఈ ఘనతను అందుకున్న నెంబర్ వన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చరిత్రను సృష్టించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X