చరిత్ర సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్: RRRకు ముందే దండయాత్ర.. టాలీవుడ్‌లోనే తొలి హీరోగా రికార్డు
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించి.. ఎవరి అండదడలూ లేకపోయినా టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. టీనేజ్‌లో ఇండస్ట్రీ హిట్ సహా ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. టాప్ హీరోగా మారిపోయాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ముందుకు సాగాడు. ఈ నేపథ్యంలోనే కెరీర్‌లో బెస్ట్ స్టేజ్‌లో కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నందమూరి హీరో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. తద్వారా టాలీవుడ్‌లోనే తొలి హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. ఆ వివరాలు మీకోసం!

వరుసగా ఐదు హిట్లు... ఈ హీరోల్లో టాప్
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్'తో మొదలైన అతడి విజయ పరంపర 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వరకూ కంటిన్యూ అయింది. ఇలా ప్రస్తుత తరంలో ఏ స్టార్ హీరోనూ వరుసగా ఐదు విజయాలను నమోదు చేయలేదు.

ప్రతిష్టాత్మక చిత్రంలో.. రియల్ హీరో పాత్ర
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇక, ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఆలియా భట్, ఒలీవియో మోరిస్ హీరోయిన్లు.

RRR కోసం సాహసాలు చేస్తున్న తారక్
RRR మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. సరైన ఫిజిక్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న అతడు.. ఎన్నో విభాగాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఓ ఫైట్ సీన్ కోసం పులి బోనులోకి వెళ్లాడు.

ఇంట్రో వీడియోతో అంచనాలు పెంచేశాడు
కొద్ది రోజుల క్రితం 'భీమ్ ఫర్ రామరాజు' పేరిట రామ్ చరణ్ పరిచయ వీడియో విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇక, ఇటీవల 'రామరాజు ఫర్ భీం' పేరిట జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తద్వారా అంచనాలు పెరిగాయి.

చరిత్ర సృష్టించిన జూనియర్ యంగ్ టైగర్
'రామరాజు ఫర్ భీం' వీడియో అప్‌లోడ్ చేసిన సమయం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్రను తిరగరాసింది. అలాగే, చాలా తక్కువ సమయంలోనే ఒక మిలియన్‌కు పైగా లైకులు కూడా సంపాదించింది. అంతేకాదు, ఒక మిలియన్ కామెంట్లు కూడా అందుకుని తెలుగు సినీ రికార్డులను తిరగరాసిందీ వీడియో.

‘రామరాజు ఫర్ భీం’ వీడియో దండయాత్ర
'రామరాజు ఫర్ భీం' వీడియో తాజాగా 100 మిలియన్ వ్యూస్‌ను అందుకుని సరికొత్త చరిత్రను లిఖించుకుంది. ఈ టీజర్‌కు ఐదు భాషల్లో కలిపి యూట్యూబ్ లో 64.49 మిలియన్, ఫేస్‌బుక్‌లో 28.24 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.37 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా 100 మిలియన్ మార్కును అందుకుంది. దీంతో #100MViewsForBheemIntro అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్‌లోనే మొదటి హీరోగా రేర్ రికార్డ్
ఇక, ఈ వీడియో తాజాగా 1.3 మిలియన్ లైక్స్‌ను అందుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి టీజర్‌గా 'రామరాజు ఫర్ భీం' రికార్డు క్రియేట్ చేసింది. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఒక టీజర్‌తో 100 మిలియన్ వ్యూస్, 1.3 మిలియన్ లైక్స్, 1.5 మిలియన్ కామెంట్స్ అందుకున్న హీరోగా ఖ్యాతి గడించాడతను.


Click it and Unblock the Notifications











