ప్లాప్ డైరెక్టర్‌కి నితిన్ గ్రీన్ సిగ్నల్.. అందమైన ప్రేమ కథ!

యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు నితిన్ కొత్త చిత్రం ప్రారంభం కాలేదు. త్వరలో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్నాడు. ఈ చిత్రం భీష్మ పేరుతో తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా నితిన్ తన తదుపరి చిత్రాల గురించి కూడా కొందరు దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. తాజాగా నితిన్ మరో చిత్రానికి సైన్ చేశాడు.

వీర, రైడ్ చిత్రాలు దర్శకుడు రమేష్ వర్మకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్ర ప్రారంభానికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు తరహాలో దర్శకుడు రమేష్ అందమైన ప్రేమ కథని సిద్ధం చేశాడట. ఈ కథ నితిన్ కు చాలా బాగా నచ్చడంతో ఓకె చేశాడు. నిర్మాతలు, సంగీత దర్శకుడు కూడా సెట్ అయిపోయాడు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Ramesh Varma to direct Nithiin.. officially announced

కోనేరు సత్యనారాయణ, హవీష్ లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఆగస్టు నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భీష్మ, రమేష్ వర్మ దర్శకత్వంలోని చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరగబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X