Bheemla Nayak Rana: ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. డేనియల్ శేఖర్ పవర్ఫుల్ వార్నింగ్

రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఉదయమే విరటపర్వం సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'భీమ్లా నాయక్' నుంచి డేనియల్ శేఖర్ మరో పవర్ఫుల్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు స్థాయి అకాశాన్ని తాకేసింది. మలయాళం బాక్సాఫీస్ హిట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు వరుస అప్డేట్స్ తో క్లారిటీ ఇస్తున్నారు.

ఇక నేడు రానా పుట్టినరోజు సందర్భంగా మరో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. సీతారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- మాటలు 'త్రివిక్రమ్' అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే 'భీమ్లా నాయక్' చిత్రం నుంచి నేడు రానా బర్త్ డే సందర్భంగా డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించిన మరో టీజర్ వదిలారు. వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు....
దీనమ్మ దిగొచ్చాడా... ఆఫ్ట్రాల్ ఎస్ ఐ.. సస్పెండెడ్...." అంటూ డేనియల్ శేఖర్ తన పవర్ఫుల్ మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు.

Rana daggubabati new dialouge teaser from bheemla nayak

మొత్తానికి రానా మరోసారి సినిమాపై పెరుగుతున్న అంచనాలను మరింత డోస్ పెంచాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాను సంక్రాంతి పోటీలో జనవరి 12న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. జనవరి 7న RRR వస్తుండగా జనవరి 14న రాధేశ్యామ్ రానుంది. అయితే ఈ పోటి నుంచి భీమ్లా నాయక్ తప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రానా పుట్టినరోజు సందర్భంగా మరో సారి క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ హడావుడిలో సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

ఇక 'భీమ్లా నాయక్' షూటింగ్ పనులన్నీ ముగింపు దశలో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నిత్య మీనన్ పవన్ కు జోడిగా నటిస్తుండగా సంయుక్త మీనన్ రానాకు పాట్నర్ గా కనిపించనున్నారు. ఇక సినిమాలో ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:'నవీన్ నూలి
ఆర్ట్ : 'ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X