twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నచూపుతో ఎగతాళి చేసేవారు.. ఇప్పుడు సత్తా తెలిసింది.. రానా

    |

    తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలపై రానా దగ్గుబాటి సెన్సేషనల్ కామెంట్ చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం దక్షిణాది వైపు చూస్తున్నది. ఇక్కడి చిత్రాలు సాధిస్తున్న విజయాలు, నిర్మిస్తున్న తీరు, కథలు హిందీ పరిశ్రమను విశేషంగా ఆకర్షిస్తుండటం మంచి పరిణామం అని రానా అన్నారు. గతంలో బాహుబలి, టెంపర్ లాంటి చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అయి ఘన విజయాలు సాధించడంతో సౌత్ సత్తా తెలిసిందన్నారు.

    ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంతకు ముందు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది. ఎగతాలిగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అమితాబ్, అక్షయ్ కుమార్, షారుఖ్ లాంటి వాళ్లు దక్షిణాది సినిమాపై కన్నేయడం ఇక్కడి సినిమాల్లో దమ్ము ఉండటమే కారణం అని రానా అన్నారు.

     Rana Daggubati about Bollywood descrimnation on south cinema

    తాజాగా కబీర్ సింగ్ సినిమాపై కూడా స్పందించారు. కబీర్ సింగ్ సాధిస్తున్న కలెక్షన్లపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమాను దేశవ్యాప్తంగా చూశారు. అయినా హిందీలో నిర్మించగా మళ్లీ అద్భుతమైన స్పందన కనిపిస్తున్నదని రానా పేర్కొన్నారు.

    కబీర్ సింగ్ గురించి నాకు ఓ మిత్రుడి నుంచి ఆసక్తికరమైన రిపోర్ట్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు వేసిన పెయిడ్ ప్రివ్యూలకు దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌లోనే అత్యధికంగా వసూళ్లు నమోదయ్యాయి. అది నాకు షాక్ కలిగించింది అని రానా అన్నారు.

    బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో జాతీయస్థాయి ప్రాజెక్టులు ఆయన ముందు క్యూ కట్టాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ స్థాయి ఉన్న సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. హాథీ మేరి సాథీ, 1945, హౌస్‌ఫుల్ 4 లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    Actor Rana Daggubati happy over the way south cinema doing at national scenario. He said, Earlier south was cornered in many way. After Baahubali, Scenario changed drastically.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X