బతకడం కష్టం.. 30 శాతమే ఛాన్స్.. కిడ్నీ ఫెయిల్యూర్‌ సమయంలో వైద్యుల రిపోర్టును వెల్లడించిన రానా

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి మళ్లీ ట్రాక్‌పైకి వచ్చారు. వరుస చిత్రాలతో జోరును కొనసాగిస్తున్నారు. తాను నటించిన అరణ్య చిత్ర ప్రమోషన్స్‌లో రానా బిజీగా మారారు. ఈ క్రమంలో తన సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితం, తన ఆరోగ్యంపై ఇటీవల తన అనుభవాలను పంచుకొన్నారు. రానా చెప్పిన విషయాలు ఏమిటంటే..

తీవ్రమైన అనారోగ్యంతో

తీవ్రమైన అనారోగ్యంతో


అరణ్య సినిమా షూటింగు సమయంలో నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డాను. నా కిడ్నీల పనితీరు వైఫల్యం చెందడంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో వైద్యులు చెప్పిన విషయాలతో ఓ రకమైన షాక్‌కు గురయ్యాను అని రానా తెలిపారు.

30 శాతం మేరకే ఛాన్స్

30 శాతం మేరకే ఛాన్స్

నా మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత నాతో, నా కుటుంబ సభ్యులతో వైద్యులు సంప్రదించారు. ఆ పరిస్థితుల్లో నాకు 70 శాతం బ్రెయిన్ హ్యామ్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 30 శాతం మేరకే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారనే విషయాన్ని రానా వెల్లడించారు.

దర్శకుడు నాకు తగినంత సమయం

దర్శకుడు నాకు తగినంత సమయం


నా ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని దర్శకుడు సాల్మన్ నాకు వీలైనంత సమయం ఇచ్చారు. నేను కోలుకొనేంత వరకు ఆయన వేచి ఉన్నారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. అడవిలో ఎక్కువ రోజులు షూట్ చేయడం వల్ల నా ఆరోగ్యం త్వరగా నయమైంది అంటూ రానా చెప్పారు.

మిహికాతో పెళ్లి నిర్ణయం

మిహికాతో పెళ్లి నిర్ణయం

అనారోగ్యం నుంచి కోలుకొన్న రానా దగ్గుబాటి లాక్‌డౌన్‌లో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తనకు, తన కుటుంబానికి సుదీర్ఘంగా పరిచయం ఉన్న మిహికాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో నిరాడంబరంగా జరిగిన వేడుకలో మిహికా మెడలో మూడు మూళ్లు వేసిన సంగతి తెలిసిందే.

26వ తేదీన అరణ్య రిలీజ్

26వ తేదీన అరణ్య రిలీజ్


హాథీ మేరే సాథి తెలుగు వెర్షన్ అరణ్య చిత్రం మార్చి 26 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పిలగావోంకర్, రఘుబాబు, టిన్ను ఆనంద్ తదితరులు నటించారు.
రచన, దర్శకత్వం: ప్రభు సోలోమన్
డైలాగ్స్: వనమాలి
మ్యూజిక్: శంతను మోయిత్రా
సినిమాటోగ్రఫి: ఏఆర్ అశోక్ కుమార్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
బ్యానర్: ఎరోస్ ఇంటర్నేషనల్
రన్‌టైమ్: 150 నిమిషాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X