twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రులు, తాతల పాత్రలు మీకు... చంద్రబాబు పాత్ర నాకా? దూల తీరిపోయింది: రానా

    |

    Recommended Video

    Rana Daggubati about The Journey Of NTR KathaNayakudu

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఇందులో భాగంగా బాలయ్యతో పాటు ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులతో ఓ డిస్క్రషన్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    అందరికీ బాగానే ఉంది. నాకే దూల తీరిపోయింది

    అందరికీ బాగానే ఉంది. నాకే దూల తీరిపోయింది

    ‘‘అందరికీ బాగానే ఉంది. నాకే దూల తీరిపోయింది. మీరు మీ డాడీలు, గ్రాండ్ ఫాదర్ పాత్రలు వేసుకుని బాగానే ఉన్నారు. నాకేమో చంద్రబాబు నాయుడుగారి పాత్ర ఇచ్చారు.'' అంటూ రానా సరదాగా నవ్వుతూ తన మనసులోని భావాలన్ని బయటపెట్టారు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి.. మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    క్రిష్ చెప్పగానే చరిత్ర విన్నట్లు అనిపించింది

    క్రిష్ చెప్పగానే చరిత్ర విన్నట్లు అనిపించింది

    బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా ఇది. నా వయసు 35. ఎన్టీ రామారావుగారు అంటే ఇష్టం. ఎలా మొదలైందో కానీ క్రిష్ వచ్చి కథ చెప్పారు. నాకు చరిత్రలో ఒక ముక్క విన్నట్లు అనిపించిందని... రానా తెలిపారు.

    తీసుకెళ్లి చంద్రబాబు ముందు కూర్చోబెట్టారు

    తీసుకెళ్లి చంద్రబాబు ముందు కూర్చోబెట్టారు

    పాత్ర వేసే ముందు నన్ను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. నువ్వు పోషిస్తున్న పాత్ర ఈ వ్యక్తిదే అని ఆయన ముందు కూర్చోబెట్టారు. ఈ సినిమాలో నేను చేసిన పార్ట్స్ అన్నీ క్రిష్ నాకు చెప్పినట్లు చంద్రబాబు నాయుడుగారు కూడా చెప్పారు. ఆయన చెప్పడం వల్ల ఆ పాత్ర ఇంకా సులభంగా చేశాను. ఒక క్యారెక్టర్‌కు ఇంతకంటే హోం వర్క్ ఉండదు... అని రానా తెలిపారు.

    వచ్చే నెల రెండో భాగం

    వచ్చే నెల రెండో భాగం

    జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ రెండో భాగం 'ఎన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Rana Daggubati about The Journey Of NTR KathaNayakudu. The movie starring Nandamuri Balakrishna, Vidya Balan, Nandamuri Kalyan Ram, Poonam Bajwa, Rana Daggubati, Manjima Mohan, Bharath Reddy, Sachin Khedekar, Himanshi Choudary, Heroshini Komali.R among others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X