సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో రానా దగ్గుబాటి.. భారీగా గ్రాఫిక్స్.. మూడు భాషల్లో గుణశేఖర్‌తో...

బాహుబలి తర్వాత దగ్గుబాటి నట వారసుడు రానా దగ్గుబాటి మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు జాతీయ స్థాయి సినిమాల్లో భాగమైన రానా మరో చారిత్రాత్మక నేపథ్యమున్న హిరణ్యకశిప చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవీ లాంటి బ్లాక్‌బస్టర్లను అందించిన గుణశేఖర్ జతకట్టాడు. ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు మీకోసం..

చారిత్రాత్మక నేపథ్యంతో మూడోసారి

చారిత్రాత్మక నేపథ్యంతో మూడోసారి

రుద్రమదేవి, బాహుబలి సినిమాల తర్వాత మరోసారి చారిత్రక కథా నేపథ్యంతో రూపొందనున్న హిరణ్యకశిప అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొనే దశలో ఉంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

భారీగా గ్రాఫిక్స్ వర్క్స్

భారీగా గ్రాఫిక్స్ వర్క్స్

హిరణ్యకశిప సినిమా భారీ గ్రాఫిక్స్ వర్క్స్‌తో తెరకెక్కనున్నది. ఈ సినిమా కోసం సెవెంటీన్ వీఎఫ్ఎక్ష్ స్టూడియో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రాఫిక్ పార్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాను రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

వేణు ఊడుగులతో విరాటపర్వం చిత్రంలో

వేణు ఊడుగులతో విరాటపర్వం చిత్రంలో

హిరణ్య కశిప సినిమాతోపాటు యువ దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించే విరాటపర్వం సినిమాలో కూడా రానా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. 1980-90లోని తెలంగాణ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నది. ఈ చిత్రం పలుభాషల్లో నిర్మించడం గమనార్హం. ఈ సినిమా కూడా జూన్, జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్నది.

 పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో

పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో

ఇవే సినిమాలు కాకుండా రానా పలు ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. దర్శకుడు ప్రభు సాల్మాన్ రూపొందించే హాథీ మేరా సాథీ, కే మధు దర్శకత్వంలో మరట్వాడ వర్మ: కింగ్ ఆఫ్ ట్రావంకోర్, 1945 సినిమాల్లో అత్యంత ప్రభావమంతమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ చిత్రాలను 2019, 2020లో విడుదలకు కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X