హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో బిగ్ మూవీ ప్లాన్ చేస్తున్న రానా.. మళ్ళీ అదే ప్లాన్?

ఒక మంచి హీరోగా గుర్తింపు అందుకోవడం కంటే కూడా మంచి నటుడిగా పేరు సంపాదిస్తేనే ఇండస్ట్రీలో పది కాలాల పాటు స్థానం ఉంటుంది అనేది అందరూ చెప్పే మాట. అందుకే స్టార్ హీరోలు చాలావరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే మ్యాజిక్ చేయాలని అనుకుంటారు. ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా అప్పుడప్పుడు వాటిని పక్కనపెట్టి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలి అనుకుంటారు. ఇక మరికొందరు మాత్రం పూర్తిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి ప్రతి కథలో ఏదో ఒక కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తరహాలో ఆలోచించే అతి కొద్దిమంది హీరోలలో ఒకరు రానా దగ్గుబాటి ఒకరు. రానా మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.

ఫస్ట్ మూవీ లీడర్ సినిమాతోనే అతని ఎంపిక విధానం క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే రానా కేవలం హీరోగానే కాకుండా తనను తాను ఒక మంచి నటుడిగా ప్రజెంట్ చేసుకోవాలి అని అనుకున్నాడు. బాహుబలి లాంటి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. బాహుబలి సినిమా అనంతరం అతను చేసిన మరికొన్ని సినిమాలు కూడా ఎంత ప్రయోగాత్మకంగా హైలెట్ అయ్యాయి. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా దగ్గుబాటి ఒక వైపు పాజిటివ్ గా మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే.

Rana daggubati another movie with young director,

అయితే తేజ దర్శకత్వంలోనే రానా తమ్ముడు కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక ఆ సినిమా పూర్తయిన వెంటనే రానా దగ్గుబాటి తో కొత్త సినిమాలు మొదలు పెట్టబోతున్నారు. గతంలో రాక్షసరాజు రావణాసురుడు టైటిల్ ను కూడా తేజ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. అయితే రానా దగ్గుబాటి మరో దర్శకుడిని కూడా లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు రానాతో ఇదివరకే ఘాజీ అనే సినిమా తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి అని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఘాజి సినిమాతో మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు కానీ ఆ తర్వాత సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు.

అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతని పేరు మార్మోగిపోయింది. వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమా చేయగా అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పిట్టకథలు వెబ్ సిరీస్ లో ఒక వెర్షన్ కు దర్శకత్వం కూడా వహించాడు. ఇక ప్రస్తుతం సంకల్ప్ మరొక కథను రెడీ చేస్తుండగా రానా దగ్గుబాటి అతన్ని పిలిపించుకుని మరి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఓకే అయితే మళ్లీ ఘాజి తరహాలోనే తెలుగు తమిళ్ హిందీ లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X