ఎవడు బ్రో నీకు చెప్పింది.. మీరు టైంపాస్ గాళ్లు అంటూ రానా షాకింగ్ కామెంట్స్

దగ్గుబాటి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా తనదైన శైలిలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బాబాయ్ వెంకటేష్ స్టార్ డంకు తగ్గట్టే రకరకాల సినిమాలు చేస్తూ తన విలక్షణ నటనను బయట పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమా గురుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి మీద రానా ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

విరాటపర్వం

విరాటపర్వం


రానా హీరోగా నటిస్తున్న చిత్రాల్లో విరాట‌పర్వం ఒక‌టి. ఈ సినిమా విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న . ఇందులో రానా న‌క్స‌లైట్ నాయ‌కుడు ర‌వ‌న్న అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా సినిమా పోస్ట్ ప్రొడకషన్ కార్య‌క్ర‌మాలు మాత్రం శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి సరయిన అప్డేట్స్ లేక పోవడంతో అనేక ప్రచారాలు అయితే బయటకు వస్తున్నాయి.

రానాకు విసుగు

రానాకు విసుగు

అందుకే ఈ సినిమాకు సంబంధించి వ‌స్తున్న‌ అనేక రకాల వార్త‌లు రానాని తెగ విసిగిస్తున్నట్టు ఉన్నాయి. మామూలుగానే రాణా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. కానీ ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు స్పందించడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి ప్రచారం జరిగినా నేరుగా వాళ్ళ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఆసక్తికరంగా స్పందిస్తాడు.

స్ట్రాంగ్ రిప్లై

స్ట్రాంగ్ రిప్లై


ఇటీవ‌ల ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్న సురేశ్ బొబ్బిలి ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయ‌గా, ఈ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని అనుకున్న రానా ద‌గ్గుబాటి సురేశ్ బొబ్బిలి ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయాడ‌ని పెట్టిన ట్వీట్‌కు స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇచ్చాడు.

ఎవ‌డు బ్రో నీకు చెప్పింది

ఎవ‌డు బ్రో నీకు చెప్పింది

అప్పుడే ఆయన ఎవ‌డు బ్రో నీకు చెప్పింది.. నీ సోది అంటూ విర‌గ‌బ‌డి న‌వ్వుతున్న రెండు సింబ‌ల్స్‌ను పోస్ట్ చేసి షాకిచ్చాడు. దెబ్బకు సదరు వెబ్సైట్ కథనాన్ని తొలగించాల్సి వచ్చింది కూడా. రానా ఎప్పుడైతే రిటార్ట్ ఇచ్చాడో నెటిజ‌న్స్‌ అయితే ఒకరకంగా పండుగ చేసుకుంటున్నారు. సినిమాల గురించి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న వారికి ఇలాగే రిప్ల‌య్ ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో మీమ్ పేజ్ భాష‌ల స‌మ‌స్య‌ల వ‌ల‌న విరాటపర్వం ఓటీటీలో రిలీజ్ అవుతుందని మాకు తెలిసింది అంటూ ప్రచారం మొదలెట్టింది.

Recommended Video

Rana Daggubati Launches First Single Acha Telugandame From Hero
నాక్కూడా చెప్పండి బ్రో

నాక్కూడా చెప్పండి బ్రో

అది చూసి రానాకు కాలినట్టుంది వెంటనే రాయ‌గా, దానిపై స్పందించిన రానా..దయచేసి ఈ భాషా సమస్యలపై నాకు అవగాహన కల్పించండి, ఏమి టైమ్ పాస్ గాళ్లు బ్రో మీరు అంటూ ట్వీట్ చేశాడు. నా సినిమా బాషా సమస్య గురించి నాకు తెలియక పోవడం కామెడీగా ఉందనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయడం నెటిజన్లకు మంచి ఫుడ్ లాగా దొరికింది..ఇలా రాసే వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. అంటూ రానాను వెనకేసుకు వస్తున్నారు. దీంతో ఎవరన్నా ఇక మీదట రానా సినిమా గురించి ఎలాంటి గాసిప్ రాయాలి అన్నా భయ పెట్టేలా నేరుగా సోషల్ మీడియాలో పరువు తీసేస్తూ ఉండడంతో కొందరు భయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X