Abhiram Marriage: రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి ఫిక్స్.. రెండూ ఒకేసారి.. ఆ అమ్మాయి ఎవరో కాదు..!

టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడుతో మొదలైన వీళ్ల కుటుంబ సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో వెంకటేష్.. ఆ తర్వాత రానా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్‌లో సుస్థితరమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే హీరోగా పరిచయం అభిరామ్ కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాగించాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి లీక్ అయింది. ఆ వివరాలను మీరే చూసేయండి!

Rana Daggubati Brother Abhiram Daggubati To Marry His Relatives Daughter

అహింస అంటూ వచ్చాడు: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడిగా ప్రపంచానికి పరిచయమైన అభిరామ్ చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అవ్వాలని భావించాడు. కానీ, ఏదీ వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే అతడు 'అహింస' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ అభిరామ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది.

Rana Daggubati Brother Abhiram Daggubati To Marry His Relatives Daughter

సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి: హీరోగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోవాలని భావించిన అభిరామ్‌కు ఆదిలోనే 'అహింస' రూపంలో బిగ్ షాక్ తగిలింది. అదే సమయంలో ఈ చిత్రం అతడికి కొన్ని పాఠాలను కూడా నేర్పించింది. దీంతో అతడు సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వాలని భావించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ఓకే చేసిన కొన్ని కథలను కూడా ఈ యంగ్ హీరో పక్కన పెట్టేశాడని అంటున్నారు.

Rana Daggubati Brother Abhiram Daggubati To Marry His Relatives Daughter

అభిరామ్ పెళ్లి గురించేగా: ఈ మధ్య టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవలే శర్వానంద్ వివాహం చేసుకోగా.. వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇంకా చాలా మంది హీరోలు పెళ్లి చేసుకోవాల్సి ఉన్నా.. రానా తమ్ముడు అభిరామ్ గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి మ్యారేజ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

అభిరామ్ మ్యారేజ్ ఫిక్స్: మొదటి నుంచి అభిరామ్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడి వివాహం గురించి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. యంగ్ హీరో అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని కూడా తాజాగా తెలిసింది.

Rana Daggubati Brother Abhiram Daggubati To Marry His Relatives Daughter

రామ్ పెళ్లాడేది ఆమెనే: వాస్తవానికి దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు లీకైన సమాచారం ప్రకారం.. అతడు ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన తన చిన్న తాత కూతురు, కూతురు (అత్త కూతురు)నే వివాహం చేసుకోబోతున్నాడట. ఇటీవలే ఇరు కుటుంబాల వాళ్లు పెళ్లి సంబంధం గురించి మాట్లాడారని టాక్.

Rana Daggubati Brother Abhiram Daggubati To Marry His Relatives Daughter

రెండూ ఒకేసారి చేసేలా: తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. యంగ్ హీరో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. వచ్చే నవంబర్‌లో నిశ్చితార్థం జరపాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా డిసెంబర్‌లోనే వీళ్లిద్దరి వివాహం కూడా జరిపించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X