దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి న్యూ హీరో.. బిగ్ బడ్జెట్ తో సురేష్ బాబు ప్లానింగ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఎవరికి వారు సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైమ గుర్తింపును అందుకున్నారు. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుంచి యువ హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో రానా దగ్గుబాటి కుటుంబం నుంచి మరొక యువ హీరో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Daggubati Abhiram Join Hands With Creative Director Ravi Babu | Filmibeat Telugu
దగ్గుబాటి నుంచి మరో వారసుడు

దగ్గుబాటి నుంచి మరో వారసుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతగానో గుర్తింపు అందుకున్న నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి వచ్చిన వెంకటేష్, రానా వారికాంటూ ఒక స్పెషల్ మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. ఇక సురేష్ బాబు చిన్న కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ న్యూస్ గత మూడేళ్ళుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

గత మూడేళ్ళుగా..

గత మూడేళ్ళుగా..

రానా తమ్ముడైన అభిరామ్ దగ్గుబాటి గురించి అందరికి తెలిసిందే. గత రెండు మూడేళ్ళుగా సురేష్ బాబు తన చిన్న కొడుకుని హీరోగా వెండితెరకు ప్రజెంట్ చేయాలని చాలా రకాల స్టోరీలను విన్నారు. ఒక సినిమా ఆల్ మోస్ట్ సెట్టయినట్లు టాక్ కూడా వచ్చింది. సెట్స్ పైకి వెళుతున్న సమయంలో మళ్ళీ ఎందుకో వెనుకడుగు వేశారు.

భారీ బడ్జెట్ తోనే

భారీ బడ్జెట్ తోనే

ఇక చాలా కాలం తరువాత సురేష్ బాబు కొడుకు భవిష్యత్తు కోసం టాలెంటెడ్ దర్శకుడిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు రవిబాబు. సరికొత్త కథలతో ప్రయోగాలు చేసే రవిబాబు స్టార్స్ తో సినిమా చేసి చాలా కాలమయ్యింది. గతంలో ప్రేన కథలతో మంచి హిట్స్ కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు అభిరామ్ కోసం మరో ప్రేమ కథని సెట్ చేసినట్లు టాక్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించే ఛాన్స్ ఉందట.

దర్శకుడు ఫామ్ లో లేకపోయినా..

దర్శకుడు ఫామ్ లో లేకపోయినా..

దర్శకుడు రవిబాబు చివరగా ఆవిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అభిరామ్ కోసం మరో సరికొత్త లవ్ స్టోరీని సెట్ చేసినట్లు సమాచారం. సురేష్ బాబు సినిమాలపై ఎంతో అనుభవం ఉన్న నిర్మాత అని అందరికి తెలిసిన విషయమే. ఇక దర్శకుడు రవిబాబు ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా కూడా కొడుకు భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టారు అంటే సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అనే సందేహం రాకుండా ఉండదు. మరి అభిరామ్ న్యూ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X