రానాకు కిడ్నీ సమస్య.. అసలు విషయం చెప్పిన దగ్గుబాటి హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ హీరో రానా. ఒకవైపు హీరోగా చేసుకుంటూనే.. మరోవైపు 'బాహుబలి'లో విలన్‌గా నటించాడు. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన ఈ యంగ్ హీరో.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రయోగాత్మకమైన చిత్రాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతడిపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఫలానా హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని రానాపై ఎన్నో రూమర్లు వచ్చాయి. అంతేకాదు, ఈ మధ్య అతడు బాగా సన్నబడడంతో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని ప్రచారం జరిగింది. కొందరైతే ఈ దగ్గుబాటి వారి అబ్బాయికి కిడ్నీ సమస్య వచ్చిందని, అందుకే బక్క పల్చగా అయిపోయాడని కూడా చెప్పుకున్నారు.

ఈ వార్తలు నిజమేనేమో అనుకున్నంతా టాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు రానా. ఇటీవల ప్రముఖ సినీ విమర్శకురాలు అనుపమ చోప్రాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడతను. ఆ సమయంలో రానా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలపై జవాబులు రాబట్టారామె. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య అంటూ వచ్చిన రూమర్లపైనా రానాను ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా ''నేను ప్రస్తుతం 'హాతీ మేరీ సాతీ' అనే సినిమాలో నటిస్తున్నాను. అందులో ముప్పై ఏళ్ల పాటు అడవిలోనే జీవించిన మనిషిగా కనిపించబోతున్నాను. ఆ పాత్రకు న్యాయం చేయడం కోసమే సన్నబడాల్సి వచ్చింది. అంతేకానీ, నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవు. ఈ సినిమా షూటింగ్ తర్వాత నేను యథా స్థానానికి వచ్చేస్తాను'' అని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా రానాపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











