హైదరాబాద్ వదిలి వెళ్లితే.. అవే రూమర్లు.. విసిగిపోతున్నా.. రానా సీరియస్

టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో రాణిస్తున్న రానా ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రానాకు ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ జరిగిందని, అది విఫలమైందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ.. నా అనారోగ్యంపై వస్తున్న రూమర్లకు సమాధానం చెప్పలేక విసిగిపోయాను. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ..

 ఆ టాపిక్ చాలా బోరింగ్‌గా ఉంది

ఆ టాపిక్ చాలా బోరింగ్‌గా ఉంది

నా ఆరోగ్యం ప్రస్తుతం బోరింగ్ టాపిక్‌గా మారింది. నేనెప్పుడూ హైదరాబాద్ నుంచి బయటకు ప్రయాణిస్తే నా అనారోగ్యంపై రూమర్లు వస్తున్నాయి. కానీ నన్ను అభిమానిస్తున్న ప్రతీ ఒక్కరు నాకు అండగా నిలుస్తున్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రానా అన్నారు.

ఎమోషనల్‌గా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్

ఎమోషనల్‌గా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్

ఇక తాను నిర్మిస్తున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గురించి స్పందించాడు. విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్‌గా కనిపించబోతున్నారు. ఆయన బయోపిక్‌లో రకరకాల వివాదాలు, అతడి జీవితంలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి, స్క్రిప్టు కారణంగానే నేను ఈ సినిమాకు సహ నిర్మాతగా మారాను అని రానా చెప్పారు.

 భావోద్వేగాలతో ముత్తయ్య జీవితం

భావోద్వేగాలతో ముత్తయ్య జీవితం

ముత్తయ్య జీవితం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడం ఖాయమని అన్నారు. కథలో ఎంతో డ్రామా ఉందని, అదీ అందరినీ ఆకట్టుకొంటుందని పేర్కొన్నారు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నేను అతిథి పాత్రలో కనిపిస్తానా అనేది ఇప్పుడే చెప్పలేను అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన జీవితంలోని ట్విస్టులు, మలుపులు ఆ సినిమాలో భాగమయ్యేందుకు కారణమయ్యాయన్నారు.

రానా దగ్గుబాటి తాజా సినిమాలు

రానా దగ్గుబాటి తాజా సినిమాలు

రానా కెరీర్ విషయానికి వస్తే, చారిత్రాత్మక నేపథ్యంతో 1945 చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో రెజీనా కాసాండ్రా, నాజర్, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. 1945 చిత్రం దాదాపు సగం పూర్తయిందని, మిగితా 50 శాతం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందనట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగులో రానా ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించే సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం హౌస్‌పుల్ 4 చిత్ర షూటింగ్ రానా బిజీగా ఉన్నారని, ఆ తర్వాత వేణు ఊడుగుల చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X