పెళ్లి తరువాత ప్రభాస్ ఇచ్చిన చాలెంజ్ పూర్తి చేసిన రానా.. అభిమానులకు ఒక ఆఫర్!
రానా దగ్గుబాటి మొన్నటివరకు పెళ్లితో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సింపుల్ గా తన ప్రేయసిని పెళ్లాడి ఒక ఇంటివాడైన రానా కొన్నిరోజుల వరకు బయటకు రాకుండా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడేమో అనుకుంటే అప్పుడే బయటకు వచ్చేశాడు. ఎప్పటిలానే తన పనులతో మళ్ళీ బిజీ అయ్యాడు. అంతే కాకుండా ప్రభాస్ ఇచ్చిన చాలెంజ్ ని పూర్తి చేసి సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేశాడు.
Recommended Video

ఆ హీరోలకు గ్రాండ్ పార్టీ
కొన్నిరోజుల క్రితం మిహికా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసిన రానా మిగతా ఈవెంట్స్ ని కూడా పెద్దగా హడావుడి లేకుండా ఫినిష్ చేసుకున్నాడు. యువ హీరోలు చాలా మంది పెళ్లికి మిస్ అయ్యారు కాబట్టి కరోనా తగ్గిన తరువాత టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ కి స్పెషల్ గా గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడట.

ప్రభాస్ ఇచ్చిన చాలెంజ్
అసలు మ్యాటర్ లోకి వస్తే.. రానాకి గతంలో గతంలో ఒక చాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం సినీ తారలు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. అయితే రానా కూడా ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. అంతే కాకుండా తన ఫాలోవర్స్ అందరిని నామినేట్ చేశాడు.

రీ ట్వీట్ ఆఫర్
సోషల్ మీడియాలో రానా ఈ విధంగా పోస్ట్ చేశాడు. కాస్త ఆలస్యం అయ్యింది. ఆది పురుష్ ప్రభాస్ అలాగే రాక్ స్టార్ శృతి హాసన్ కి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటల్సిందిగా నామినేట్ చేసినందుకు గాని వారు ఇచ్చిన చాలెంజ్ ని పూర్తి చేశాను. అలాగే తనను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ చాలెంజ్ అంటూ మొక్కలు నాటి ట్యాగ్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తానని కూడా ఆఫర్ ఇచ్చాడు.

మళ్ళీ సినిమాలతో బిజీగా..
రానా దగ్గుబాటి నెక్స్ట్ అరణ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటు 1945, విరాట పర్వం అనే ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో కూడా హిరణ్యకశిప అనే పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











