ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చా.. రానా ఎమోషనల్..

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చాలా తక్కువ టైమ్‌లోనే తెలుగుతో పాటు హిందీ, తమిళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఆయన నటులలో పాదరసం లాంటి వాడు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. ఎలాంటి పాత్రకైనా సై అంటాడు. ముఖ్యంగా బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి రానా తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?

భల్లాలదేవ గా వెండితెరపై ఉగ్రరూపం చూపించిన రానా దగ్గుబాటి (Rana Daggubati)..తన నిజ జీవితంలో మాత్రం మృత్యువుతో ముఖాముఖి పోరాటం చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు హార్ట్ సమస్యలు, చూపు సంబంధిత ఇబ్బందులు... ఇలా వరుస ఆరోగ్య సంక్షోభాలు తన జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేశాయని చెప్పారు. ఆ సమయంలో తన ముందున్న ఏకైక లక్ష్యం 'బతకడమే' అని రానా స్పష్టం చేశారు.

Rana Daggubati Opens Up on Health Battle and Near-Death Experience After Baahubali

ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తర్వాత కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఈ అనారోగ్యం ఎదురవ్వడం తనను తీవ్రంగా కుదిపేసిందన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందని, దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకున్న తర్వాత భారత్‌కు తిరిగొచ్చినప్పుడు అద్దంలో తనను చూసుకుంటే గుర్తుపట్టలేనంతగా కృశించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆ దశలో సినిమా కెరీర్, స్టార్‌డమ్ ఏమీ గుర్తుకు రాలేదు. నా శరీరం సహకరించాలి.. నేను బ్రతకాలి..అంతే," అని రానా గుర్తుచేసుకున్నారు.

ఆ అనుభవమే తనకు 'నేనెవరు?' అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని, అప్పటి నుంచి జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టానన్నారు. ఆపరేషన్‌కు ముందు ఒప్పుకున్న కొన్ని భారీ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని రానా తెలిపారు. ముఖ్యంగా ఒక రెజ్లర్ కథతో తెరకెక్కాల్సిన సినిమాకు సంతకం చేసినప్పటికీ, తన ప్రస్తుత శారీరక స్థితి ఆ పాత్రకు సరిపోదని భావించి నిర్మాతలకు తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేశానన్నారు. 'నటుడిగా నా ఇమేజ్ కంటే బాధ్యత ముఖ్యం' అని చెప్పుకొచ్చారు.

వరుణ్ తేజ్‌లో నన్ను నేను చూసుకున్నా...
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనారోగ్య సమయంలో వరుణ్ తనను పరామర్శించడానికి వచ్చిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, 'అతడిని చూస్తుంటే పాత రానా కనిపించాడు. నేను ఉండాల్సిన రూపంలో అతడు ఉన్నాడు. ఒక క్షణం నా కథలన్నీ అతడికే ఇచ్చేయాలా? అనిపించింది' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే.. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో ఓ ఇమిగ్రేషన్ అధికారి తనను 'కింగ్ భల్లాలదేవ' అని పిలవడం మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసిందని, ఆ చిన్న సంఘటన తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు
ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రానా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. నటుడిగానే కాదు, నిర్మాతగా, హోస్ట్‌గా కూడా బిజీగా మారారు. వెబ్ సిరీస్‌లు, క్యామియో పాత్రలు, కొత్త సినిమాలతో కెరీర్‌కు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 'జీవితం నాకు రెండో ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు మునుపటి కంటే డబుల్ ఎనర్జీతో ముందుకెళ్తా' అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రానా చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X