చిత్ర యూనిట్‌కు రానా హామీ.. త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - సాయి పల్లవి కలిసి చేయబోతున్న చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అలాగే సాయి పల్లవి మావోయిస్టుగా కనిపించబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో క్లారిటీ అయితే రాలేదు.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కానీ, సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ప్రస్తుతం రానా విదేశాల్లో ఉన్నాడు. ఆయనకు కిడ్నీకి సంబంధించిన చికిత్స జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ విషయంపై అటు రానా గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. అందులో 'విరాట పర్వం' కూడా ఉంది.
రానా అందుబాటులో లేకపోవడంతో 'విరాట పర్వం' యూనిట్‌తో పాటు హీరోయిన్ సాయి పల్లవి కూడా వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అతడు త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాను అని చిత్ర యూనిట్‌కు హామీ ఇచ్చాడట. దీంతో ఈ సినిమా మరికొద్దిరోజుల్లోనే పట్టాలెక్కనుందని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రానా ఇచ్చిన హామీతో సాయి పల్లవితో పాటు చిత్ర యూనిట్ కూడా ఖుషీగా ఉందని టాక్.


Click it and Unblock the Notifications











