అభిమాని ఫోన్ లాగేసుకొన్న రానా దగ్గుబాటి.. మిహికాతో కలిసి శ్రీవారి దర్శనం వేళ ఘటన. వీడియో వైరల్
టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి వార్తల్లో ఉండటానికి ఇష్టపడరు. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్‌కు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమా ప్రమోషన్స్, ప్రొఫెషనల్ వర్క్ విషయానికి వస్తే తప్పా మీడియాలో కనిపించరు. అయితే ఇటీవల తనపై వస్తున్న కొన్ని రూమర్లకు తెర దించుతూ తన శ్రీమతి మిహికా బజాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. అయితే తిరుమలలో జరిగిన తమాషా సంఘటన వివరాల్లోకి వెళితే..

మిహికాతో ప్రేమ, పెళ్లి
లాక్‌డౌన్ సమయంలో అభిమానులకు, స్నేహితులకు, సన్నిహితులకు షాక్ ఇస్తూ పెళ్లి ప్రకటన చేశారు. అయితే కరోనా నిబంధనలు కొనసాగుతుండటంతో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి దాంపత్య జీవితం హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో కనిపించాయి.

రానాపై రూమర్లు
అయితే మిహికా బజాజ్, రానా దగ్గుబాటి మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్నాయంటూ సోషల్ మీడియాలో గాసిప్ వార్త హల్‌చల్ చేసింది. అదే సమయంలో తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలు డిలీట్ చేయడంతో ఆ వార్తకు ప్రాణం పోసినట్టు అయింది. అయితే తన సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు డిలీట్ చేయడం వెనుక కారణాన్ని వివరించి గాసిప్స్ తెరదించారు.

మ్యారేజ్ డే రోజున ఫ్యాన్స్‌కు ట్రీట్
ఇటీవల తమ మ్యారేజ్ డే రోజున పోస్టు పెట్టి మిహికా సర్‌ప్రైజ్ ఇచ్చారు. రానాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను వ్యక్తీకరించారు. దాంతో గాసిప్స్ వార్తలకు చెక్ పెట్టారు. ఇటీవల తమ రెండో వివాహా దినోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకొన్నారు.

శ్రీవారిని దర్శించుకొన్న రానా
ఇదిలా ఉంటే.. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్, తన కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. శ్రీవారి దర్శనం తర్వాత కుటుంబ సభ్యులతో బయటకు వస్తూ అభిమానులను ఆకట్టుకొన్నారు. అయితే రానాతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ వెంబడి పడ్డారు.

అభిమానులు వెంటపడటంతో
అయితే తనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ప్రయత్నించిన అభిమానులను రానా దగ్గుబాటి వారించారు. అయినా తన వెంబడి పడి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతకు వారించినా వినకపోవడంతో తమాషాగా అభిమాని ఫోన్ లాగేసుకొన్నాడు. ఆ తర్వాత అభిమానితోపాటు రానా నవ్వుల్లో మునిగిపోయారు. ఆలయ ప్రాంతంలో ఫోటోలు దిగడం నిబంధనలకు విరుద్ధం అని రానా చెప్పారు. అభిమాని ఫోన్ లాగేసుకొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
భీమ్లా నాయక్, విరాటపర్వంతో
రానా దగ్గుబాటి కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల భీమ్లా నాయక్, విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలోనే మార్తాండ వర్మ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 18 శతాబ్దం నాటి ట్రావెంకోర్ రాజుకు సంబంధించిన కథతో పిరియాడిక్ చిత్రంలో రానా కనిపిస్తాడు. ఇంకా పలు చిత్రాల చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











