స్టార్ కిడ్స్‌కే అవకాశాలు.. రానా రియాక్షన్
సినిమా ఇండస్ట్రీలో నేపోటిజం (వారసత్వం) అనే అంశంపై చాలా ఏళ్లుగా చర్చలు సాగుతున్నాయి. అన్ని భాషల్లోని చిత్ర సీమల్లో ఈ రకమైన కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. టాలెంట్ తో సంబంధం లేకుండా కేవలం స్టార్ కిడ్స్ అనే ఓకే ఒక ఆధారంతో సినిమా అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయమై తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో దగ్గుబాటి రానా ఆసక్తికరంగా స్పందించారు. కేవలం వారసత్వం మాత్రమే సినీ కెరీర్ నిలబెట్టదని, టాలెంట్ కూడా ఉండాలని రానా పేర్కొన్నాడు.
ఎంత పెద్ద ఫిలిం ఇన్స్టిట్యూట్ అయినా సరే పూర్తి స్థాయి నటుణ్ని తయారు చేయలేదని,
నటన నేర్చుకున్న వ్యక్తిలో టాలెంట్ ఉంటే తప్ప సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని రానా అన్నారు. నిజానికి తండ్రి వారసత్వం పిల్లల్లో అలా ఇమిడి పోతుందని ఈ సందర్బంగా రానా చెప్పారు. దీనికి ఉదాహరణగా చిన్నప్పటి నుంచి తండ్రి చేస్తున్న పనులను గమనిస్తూ ఆ వ్యక్తిలో అలాంటి భావాలు చొచ్చుకు పోతాయని అందుకే సినిమా ఇండస్ట్రీలో వారసులే ఎక్కువగా సక్సెస్ అవుతున్నారని రానా తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కిడ్స్ కొనసాగుతున్నారని, వారంతా కేవలం వారి టాలెంట్ తోనే తమని తాము నిరూపించుకొని పైకొచ్చారు తప్ప స్టార్ కిడ్స్ అనే ముద్రతో కాదని రానా పేర్కొన్నాడు. ఒకవేళ స్టార్ కిడ్ అనే కోణంలో త్వరగా అవకాశాలు వస్తాయన్న మాట నిజం అయితే తొలి అవకాశం ఇచ్చిన తర్వాత తమని తాము నిరూపించుకోవాలి అంతేకానీ ప్రతీ సినిమాలో అవకాశం ఇప్పించడం కుదరదుగా అని రానా అన్నారు. ఇక తన విషయానికొస్తే.. ''మా నాన్న నిర్మాత. అమ్మ ఫిలిం ల్యాబ్స్ చూసుకునేవారు. బాబాయ్ హీరో. కాబట్టి నాకు సినిమాలపై అవగాహన బాగానే ఉంటుంది'' అని రానా పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











