For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానాకు ఏమైంది? ఇన్‌స్టాలో షాకింగ్‌ ఫొటో.. ఫ్యాన్స్‌ ఆందోళన

By Bhavani
|

రానా దగ్గుబాటికి ఏమైంది. భల్లాలదేవ నిజంగానే అనారోగ్యంతో ఉన్నాడా అనే ఆందోళన మరోసారి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. రానా అనారోగ్యంతో ఉన్నాడని, గత కొన్ని నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతున్నాడని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను మరింత కలవరానికి గురి చేస్తోంది. తాజా ఫొటోలో రానా తన లుక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆయన మరీ సన్నగా కనిపించడమే ఇందుకు కారణం.

అసలు రానాకు ఏమైంది

అసలు రానాకు ఏమైంది

రానా ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయించుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. ఈ కథనాలను రానా కొట్టిపారేశాడు కూడా. తన ఆరోగ్యం బాగానే ఉందని, తన ఆరోగ్యం గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని ఆయన ఫ్యాన్స్ ను కోరారు

ఇన్‌స్టాలో షాకింగ్‌ ఫొటో..

ఇన్‌స్టాలో షాకింగ్‌ ఫొటో..

ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ రానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో భల్లాల దేవా చాలా సన్నగా కనిపించాడు. బాహుబలిలో కండలు తిరిగిన దేహంతో విలన్‌కు మారుపేరుగా కనిపించిన భల్లా.. గతంలో అమెరికా వెళ్లడానికి పూర్వం కనిపించిన లుక్‌ కంటే కూడా సన్నగా కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈసారి మరీ సన్నగా కనిపించడం అభిమానులకు షాక్ ఇస్తోంది.

మీకు ఏమైంది? అంతా బాగానే ఉందా?

మీకు ఏమైంది? అంతా బాగానే ఉందా?

రానా లేటెస్ట్‌ ఫోటో చూసిన అభిమానులు మీ ఆరోగ్యానికి ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం పెద్దసంఖ్యలో కనిపిస్తోంది. ఈ ఫోటోకు రెండు గంటల్లోనే 86 వేల పైగా లైక్స్ వచ్చాయి. కానీ, ఈ ఫోటో కింద ఉన్న కామెంట్ లో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మీరు చాలా సన్నగా అనారోగ్యంగా కనిపిస్తున్నారు.. అంతా బాగానే ఉందా అని ఓ ఫ్యాన్‌ ప్రశ్నించగా... ఓ మై గాడ్.. ఆర్ యు ఓకే డియర్ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు

గతంలోనే క్లారిటీ

గతంలోనే క్లారిటీ

తన ఆరోగ్యం గురించి రానా గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. `నేను కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నానుని ఇప్పటికే ఎన్నో వదంతులు సృష్టించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. బావున్నానని చెప్పి చెప్పి విసుగోస్తోంది. నా ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు ఇప్పుడు బోరింగ్ టాపిక్ గా మారిపోయాయి. నేను హైదరాబాద్ వదిలితే చాలు ప్రజలు ఏవేవో ఊహించుకుంటున్నారు. ఏదిఏమైనా నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు` అని ఒక ప్రకటనలో తెలిపారు

హిరణ్యకశ్యప కోసమే అమెరికాకు..

హిరణ్యకశ్యప కోసమే అమెరికాకు..

పురాణ ఇతిహాస చిత్రం హిరణ్యకశ్యప కోసం తాను అమెరికాలో ఉన్నట్టు అప్పట్లో రాణా తెలిపాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న హిరణ్యకశ్యపను చాలా గ్రాండ్ గా, పెద్ద ఎత్తున రూపొందించాలని భావిస్తున్నామని, ఈ సినిమా ఫ్రీ విజువలైజేషన్, వీఎఫ్‌ఎక్స్‌ కోసమే అమెరికాలో ఉన్నానని వివరించారు.

English summary
Rana Daggubati took to Instagram to share a photo of himself promoting a brand. In the new photo, Rana sports a leaner look. He has been in the news for a couple of months regarding his ill health
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more