Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అజయ్ దేవగన్ చిత్రంలో రానా.. మిలటరీ అధికారిగా!
అజయ్ దేవగన్ నటించేబోయే భుజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. దర్శకుడు అభిషేక్ డుదయా ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించబోతున్నాడు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో ఓ హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రానా మిలటరీ కల్నల్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.
1971 ఇండియా పాక్ వార్ నేపథ్యంలో అభిషేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ విజయ్ కర్ణిక యుద్ధ సమయంలో గుజరాత్ లోనే భుజ్ ప్రాంతంలో ఎంతోమంది ప్రజలని యుద్ధం నుంచి రక్షించారు. ఆయన పాత్రని అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. యుద్ధ సమయంలో భుజ్ ప్రాంతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నారు. అజయ్ దేవగన్ ఇప్పటివరకు పోలీస్ అధికారిగా చాలా చిత్రాల్లో నటించాడు కానీ ఎయిర్ ఫోర్స్ అధికారిగా నటించనుండడం ఇదే తొలిసారి. ఇక రాజా ఇప్పటికే ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో సాగే ఘాజి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.