అవి తప్పుడు వార్తలేనా, ఆ భారీ ప్రాజెక్ట్ సంగతేమైంది?... మీడియా ముందుకు రానా!
టాలీవుడ్ నటుడు, బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తల్లో నిలిచారు. అయితే అందులో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని రానా కొట్టిపారేశారు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'హిరణ్యకశ్యప' కోసమే తాను యుఎస్ఏలో ఉన్నట్లు వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం... రానా త్వరలో తిరిగి హైదరాబాద్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం రానా హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మీడియాతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. తనపై వచ్చిన రూమర్లపై ఆయన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది.

హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి
వాస్తవానికి ఈ వారమే రానా హైదరాబాద్ చేరుకోవలసి ఉంది, అయితే అమెరికాలో ‘హిరణ్యకశ్యప' ప్రీ-విజువలైజేషన్ కాన్సెప్టుకు సంబంధించిన పనులు అనుకున్నసమాయానికి పూర్తికాకపోవడంతో తన జర్నీ వాయిదా వేసుకున్నారట. అమెరికాలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి ఆయన పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

విరాట పర్వం
రానా హీరోగా ఇప్పటికే ‘విరాట పర్వం 1992' అనే ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ షూటింగ్ రానా హైదరాబాద్ వచ్చాక మొదలు కానుంది. దీంతో పాటు చర్చల దశలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులకు ఆయన సైన్ చేసే అవకాశం ఉంది.

హెల్త్ రూమర్లు బోరింగ్ టాపిక్
తనపై వచ్చిన కిడ్నీ మార్పిడి రూమర్లపై గతంలో రానా ఒక ప్రకటనలో స్పందిస్తూ... "నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఈ విషయంపై నేను చాలా సార్లు క్లారిటీ ఇచ్చి విసిగిపోయాను. ఇవి కేవలం పుకార్లు మాత్రమే. నా ఆరోగ్యంపై రూమర్స్ ఒక బోరింగ్ టాపిక్. హైదరాబాద్ నుండి బయకు వెళ్లిన ప్రతిసారీ నాకు ఏదో అయిందని ఆందోళన చెందుతున్నారు. వారు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను'' అన్నారు.

లావిష్ ప్రాజెక్టుగా ‘హిరణ్యకశ్యప'
హిరణ్యకశ్యప చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో లావిష్‌గా తెరకెక్కిస్తున్నట్లు రానా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ కాన్సెప్టు మీద పని చేసేందుకే యూఎస్ఏ వచ్చాను, వివిధ విఎఫ్ఎక్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కొన్ని రోజుల క్రితం రానా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











