సుబ్రహ్మణ్యపురం చిత్రానికి రానా వాయిస్ ఓవర్!

భల్లాలదేవుడు రానా పాత్రే కీలకంగా అనే సినిమాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రానా పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. కేవలం నటుడిగా మాత్రమే కాక టీవీ హోస్ట్ గా కూడా రానా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆరడుగుల ఆజానుబాహుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. సుమంత్ ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి రానా వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దేవాలయం చుట్టూ ఉత్కంఠ భరిత అంశాలతో సాగే ఈ చిత్రానికి రానా వాయిస్ ఓవర్ కీలకం కానుంది. తాజాగా రానా డబ్బింగ్ పూర్తి చేశాడు.

Rana Daggubati voiceover to Sumanth movie

ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆలయం నేపథ్యంలో జరుగుతున్న అంతుచిక్కని సంఘటనలు, ఆ మిస్టరీని చేధించే సుమంత్ పాత్ర ఆసక్తిని రేపుతున్నాయి. చాలా కలం తరువాత మళ్ళిరావా లాంటి మంచి చిత్రంతో సుమంత్ పుంజుకున్నాడు. సుబ్రహ్మణ్యపురం విజయం సాధిస్తే సుమంత్ కెరీర్ మళ్ళీ గాడిలో పడ్డట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X