యంగ్ చంద్రబాబుగా రానా.. ఫోటో వైరల్!
విభిన్నమైన పాత్రలు, నటనతో హీరో రానా జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి వంటి చిత్రాలలో రానా అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ఓ బాలీవుడ్ చిత్రంలోనటిస్తున్నాడు. హాథీ మేరెసాథీ అనే చిత్రం తెలుగు తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ లో అత్యంత కీలకమైన నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించబోతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు గుబురు గడ్డంతో కనిపించిన రానా ప్రస్తుతం క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. రానా కొత్త లుక్ ఎన్టీఆర్ బయోపిక్ కోసమే అని ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి ఫోటో, రానా తాజా లుక్ ని పోల్చుకుంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య పాత్ర తరువాత ఆ స్థాయిలో రానా పాత్ర హైలైట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











