రానా, సాయిపల్లవి క్రేజీ కాంబోలో 'విరాటపర్వం 1992'!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రానా కొన్ని బహుభాషా చిత్రాలలో నటిస్తున్నాడు. తాజాగా మరో విభిన్నమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నీదీ నాది ఒకే కథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు అడుగుల ఆసక్తికరమైన చిత్రానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ ఖరారు చేశారు. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి ముందుగా నాని, శర్వానంద్, నితిన్ లాంటి యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ చివరకు రానా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











