twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలు, పెళ్లి నాకు అర్థం కావు.. జెర్సీ చూసి కంటతడి పెట్టా.. నానిని చూస్తే.. రానా

    |

    దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని రాబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని, శ్రద్ధా శ్రీనాత్, రోనిత్ కమ్రా, కృష్ణకాంత్‌, నవీన్‌ నూలి, మాస్టర్‌ రోనిత్‌, విశ్వంత్‌, నవీన్‌, కొమురం, కమల్‌, కృష్ణ, సురేష్‌, అనిల్‌- భాను, నీరజ కోన, విజయ్‌, అవినాష్‌ కొల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ...

    క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి నాకు..

    క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి నాకు..

    సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులైంది. జెర్సీ సినిమా చూసిన తర్వాత తప్పకుండా తప్పకుండా సక్సెస్ మీట్‌కు రావాలని అనుకొన్నాను. నాకు జీవితంలో కొన్ని విషయాలు అర్థం కావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు అర్థం కాని విషయాలు. అలాంటి నాకే జెర్సీ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఊహించుకోలేను అని రానా అన్నారు.

     నాని చూస్తే నాలో తపన

    నాని చూస్తే నాలో తపన

    నానీ గొప్ప నటుడు. ఆయనను వారంలో నేను మూడుసార్లు కలుస్తాను. కలిసిన ప్రతీసారి నాలో స్ఫూర్తిని నింపుతాడు. ప్రతీ సినిమాలో కొత్తగా చేయాలని, కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటాడు. సినిమా సినిమాకు చూపించే ప్రేమ నన్ను విపరీతంగా ఆకట్టుకొంటుంది. అతడిని పట్టుదల చూస్తే నాలో కూడా తపన పెరిగిపోతుంటుంది అని రానా అన్నారు.

     గౌతమ్.. నా హృదయాన్ని టచ్ చేశావు

    గౌతమ్.. నా హృదయాన్ని టచ్ చేశావు

    మళ్లీరావా సినిమా తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని కలిశాను. నాకు ఆ సినిమా బాగా నచ్చింది. జెర్సీ సినిమా ఓ ఫిల్మ్ మేకర్‌గా, స్టోరీ టెల్లర్‌గా మీ ప్రతిభ అమోఘం. ఎంతో మంది హృదయాలను టచ్ చేసింది. నన్ను ఆకట్టుకోలేని చాలా విషయాలు ఇందులో కనిపించాయి. కానీ నా హృదయాన్ని టచ్ చేసింది అని గౌతమ్‌పై రానా ప్రశంసల వర్షం కురిపించారు.

     శ్రద్ధా నీ అభిమానిగా మారాను

    శ్రద్ధా నీ అభిమానిగా మారాను

    శ్రద్ధా శ్రీనాథ్‌కు ఉన్న అభిమానుల్లో నేను ఒకరిని. కన్నడలో యూటర్న్ సినిమా చూసిన తర్వాత నేను నీ అభిమానిగా మారిపోయాను. తెలుగులో నీ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నావు. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రద్ధా శ్రీనాథ్‌కు వెల్ కమ్ అని రానా అన్నారు. ఇక బాలనటుడు రోనిత్ కమ్రాతో.. సార్.. నేను మీ ఫ్యాన్స్.. నా పేరు రానా అంటూ రానా చమత్కరించాడు.

    జెర్సీ సినిమా గొప్పగా ఉంది

    జెర్సీ సినిమా గొప్పగా ఉంది

    సినిమా అనేది శాశ్వతం. అందులో జెర్సీ సినిమా గొప్ప చిత్రంగా శాశ్వతంగా ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ సాంకేతిక నిపుణుడు, నటులకు ఈ చిత్రం మెరిట్‌గా నిలుస్తుంది అని రానా చివరగా అన్నారు. రానా స్పీచ్ ప్రతీ ఒక్కరిని చప్పట్లు కొట్టించేలా ఉంది అని అన్నారు.

    English summary
    Natural Star Nani's latest movie is Jersey. First Single from #JERSEY will release on 14th February! Directed by Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi under Sithara Entertainments. An Anirudh Musical!. This film set to release on April 19th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X