విరాట పర్వం మ్యూజిక్ డైరెక్టర్ ఔట్ అంటూ ప్రచారం..నీ సోది అంటూ షాకిచ్చిన రానా

సాధారణంగా సినిమాల గురించి కొన్ని ఊహాజనిత వార్తలు బయటకు రావడం కామన్. ఇది వరకు రోజుల్లో పెద్దగా హీరో హీరోయిన్లు ఈ విషయాలను పట్టించుకునే వారు కాదు కానీ సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయాక వెంటనే కౌంటర్లిచ్చేస్తున్నారు. తాజాగా దగ్గుబాటి హీరో రానా ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.. రానా దేని గురించి కౌంటర్ ఇచ్చాడు? అసలు ఏం జరిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

 సెలక్టివ్

సెలక్టివ్

హీరో దగ్గుబాటి రానా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. గత ఏడాది తన ప్రేయసి మిహీకా బజాజ్ తో ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన రానా చివరి సారిగా అరణ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా రానా నటనకు మంచి మార్కులు దక్కాయి. అయితే అది కమర్షియల్ సినిమా కాకపోవడంతో కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. ఇప్పుడు రానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

 వేణు దర్శకత్వంలో

వేణు దర్శకత్వంలో

నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు వేణు దర్శకత్వంలో రానా విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ విరాట పర్వం అనే సినిమాలో రానా ఒక నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి ఆయన మరదలు పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో మరింత మంది సీనియర్ నటీమణులు కూడా నటిస్తున్నారు. ప్రియమణి, జరీనా వాహబ్ లాంటి నటీమణులు నటిస్తుండడంతో సినిమా మీద అంత కంతకు ఆసక్తి పెరుగుతోంది.

సంగీత దర్శకుడు తప్పుకున్నాడు అంటూ

సంగీత దర్శకుడు తప్పుకున్నాడు అంటూ

ఈ సినిమాకు నీది నాది ఒకే కథ సినిమా సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. వేణు ఉడుగుల సురేష్ బొబ్బిలి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో రెండో సినిమాకి కూడా ఆయననే సంగీతదర్శకుడిగా కంటిన్యూ చేస్తున్నారు వేణు. అయితే తాజాగా వేణు ఊడుగుల సురేష్ బొబ్బిలి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయని అందుకే ఈ సినిమాలో నేను కొనసాగలేనని చెబుతూ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడని ఒక వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది.

 నీ సోది

నీ సోది

సురేష్ బొబ్బిలి తప్పుకోవడంతో మరో సంగీత దర్శకుడు పని మొదలు పెట్టాడు అని చెబుతూ సామ్ సీఎస్ అనే సంగీత దర్శకుడు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాడు అని పని కూడా మొదలు పెట్టాడు అని ప్రచురించింది. అయితే ఈ విషయం మీదనే తాజాగా రానా దగ్గుబాటి స్పందించాడు. ఆ వెబ్ సైట్కు సంబంధించిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఎవడు బ్రో నీకు చెప్పింది, నీ సోది అంటూ కాస్త సీరియస్ అయ్యాడు రానా.

Recommended Video

Rana Daggubati Launches First Single Acha Telugandame From Hero
అయ్యప్పనుమ్ కోషీయం

అయ్యప్పనుమ్ కోషీయం

దీన్నిబట్టి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కాకుండా రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక మాజీ మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ఉండగా ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X