Animal 2000 కోట్ల క్లబ్‌లో రణ్‌బీర్ కపూర్.. షారుక్, సల్మాన్, షారుక్‌కు ధీటుగా!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమా రికార్డు కలెక్షన్లను కురిపిస్తున్నది. ఈ మూవీతో రణ్‌బీర్ కపూర్‌కు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. 500 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన హీరోల జాబితాలో ఆయన ఘనతను సొంతం చేసుకొన్నాడు. అయితే యానిమల్ కాకుండా వ్యక్తిగతం రణ్‌బీర్ కపూర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

అక్షయ్ కుమార్ కలెక్షన్లు:బాలీవుడ్‌లో తమ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల్లో అక్షయ్ కుమార్ టాప్ స్టానంలో ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు తన కెరీర్‌లో 114 సినిమాల్లో నటించారు. కొన్ని సోలోగా, మరికొన్ని మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించాడు. అయితే వందకుపైగా చిత్రాల్లో నటించడం ద్వారా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద 5000 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించాయి.

Ranbir Kapoor joins 2000 crore club: Here is Animal Hero entire career Collections

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బాక్సాఫీస్ రిపోర్ట్:ఇక హిందీ సినిమాలో బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పడించిన హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉంటాడు. ఆయన ఇప్పటి వరకు తన కెరీర్‌లో 65 సినిమాల్లో నటించారు. అయితే బాక్సాఫీస్ వద్ద 4300 కోట్ల రూపాయల కలెక్షన్లను తన సినిమాల ద్వారా కలెక్ట్ చేశారు.

Ranbir Kapoor joins 2000 crore club: Here is Animal Hero entire career Collections

అమీర్ ఖాన్ ఎన్ని కోట్లు సాధించాడంటే?:అలాగే మిస్టర్ ఫర్‌ఫక్ట్ అమీర్ ఖాన్ కలెక్షన్లు చూస్తే అందర్నీ ఆశ్చర్య పరిచేలా ఉంటాయి. ఇప్పటి వరకు 30కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తన సినిమాల ద్వరా దాదాపు 4000 కోట్లకుపైగా వసూళ్లను సాధించాడు.

Ranbir Kapoor joins 2000 crore club: Here is Animal Hero entire career Collections

షారుక్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా ఎంతంటే?:ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో తన సినిమాల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల్లో బాద్షా నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు 61 సినిమాల్లో నటించాడు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 3700 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

అజయ్ దేవగన్ కలెక్షన్లు:షారుక్ ఖాన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల్లో అజయ్ దేవగణ్ ఉన్నారు. ఆయన ఇప్పటి వరు 87 సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధించాడు. సుమారుగా 3400 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేశాడు.

Ranbir Kapoor joins 2000 crore club: Here is Animal Hero entire career Collections

2000 కోట్ల క్లబ్‌లో రణ్‌బీర్ కపూర్ :తాజాగా యానిమల్ సినిమాతో రణ్‌బీర్ అగ్ర హీరోల సరసన చేరాడు. యే జవానీ హై దీవానీ, సంజూ లాంటి సినిమాలు 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించాయి. తాజాగా యానిమల్ సినిమా 600 కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో 2000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరాడు. రణ్‌బీర్ కేవలం 21 సినిమాల ద్వారానే సాధించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X