రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై వివాదం..బట్టలు సేకరించి మరీ పంపారట!
రణ్‌వీర్‌సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేయడం చర్చనీయాంశం అయింది. అసలు ఏమైందంటూ పలువురు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రణ్‌వీర్ తొలిసారి నగ్నంగా కనిపించలేదు. రణ్‌వీర్ మొదటిసారి బట్టలు లేకుండా తెరపై కనిపించడం కూడా ఆసక్తికరమే. ఇంతకుముందు 'బేఫిక్రే' సినిమాలో ఆయన పూర్తి న్యూడ్ సీన్స్ చేశాడు. అయితే అప్పట్లో దీని గురించి ఎలాంటి చర్చ జరగలేదు, రణవీర్ ఇలాంటి పని చేశాడని ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక మేగజైన్ కోసం ఫోటోషూట్ చేయడమే కాక వేల మంది ముందు తాను బట్టలు లేకుండా రాగలనని, తనను ఎవరైనా ఎంత తిట్టినా పట్టించుకోనని రణవీర్ అంటున్నాడు.
రీసెంట్‌గా కరణ్ జోహార్ షోలో నేను ఎవరి వ్యాఖ్యలను పట్టించుకోను అని తన కూల్ స్టైల్‌లో చెప్పాడు. ఇక మీమర్స్ అయితే మీమ్స్‌తో ఫన్నీగా కొంతమంది సీరియస్‌గా విరుచుకుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు ఆయనని పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై సామాజిక కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. కొందరు అయితే రణ్‌వీర్ సింగ్ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కట్టారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను చూసిన మరికొందరు ఆయనకు దుస్తులు సేకరించి పంపారు. పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే.

1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం ప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోపక్క రణ్‌వీర్ చిత్రాలను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ, షెర్లిన్ చోప్రా విరుచుకుపడ్డారు. మేము ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం బోల్డ్‌గా షూట్ చేసినప్పుడు, ప్రజలు సహా మీడియా మమ్మల్ని క్యారెక్టర్‌లెస్, అని రకరకాలుగా అగౌరవంగా పిలిచేవారని అన్నారు. అయితే అబ్బాయిలు బోల్డ్‌గా షూట్ చేసినప్పుడు, ఈ ఉర్దూవుడ్ అలాగే మీడియా వారి కళను మెచ్చుకోవడంలో బిజీగా ఉన్నారని, మీరు ఈ ద్వంద్వ ప్రమాణం ఎందుకు చేస్తున్నారు? అంటూ ఆమె ప్రశ్నించారు. చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని అంటున్నారు. మరి దీనిపై రణ్‌వీర్ సింగ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











