twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాకిస్థాన్ క్రికెట్ అభిమానిని ఓదార్చిన రణవీర్ సింగ్... వైరల్ వీడియో!

    |

    ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇటీవల ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దాయాది దేశాలైన ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా మరోసారి టీమిండియా పేయర్లు పాక్ జట్టును సునాయాసంగా మట్టికరిపించారు. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ఈ మ్యాచ్ వీక్షించేందుకు పలువురు ఇండియన్ ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ తారలు మాంచెస్టర్ చేరుకుని సందడి చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు, తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ భిన్నమైన వస్త్రధారణతో హడావుడి చేశారు. టీమిండియా క్రికెటర్లతో కలిసి సెల్ఫీలు దిగుతూ హల్ చల్ చేశారు.

    పాకిస్థాన్ అభిమానిని ఓదార్చిన రణవీర్

    పాకిస్థాన్ అభిమానిని ఓదార్చిన రణవీర్

    తాజాగా రణవీర్ సింగ్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రణవీర్ సంగ్ ఓ పాకిస్థాన్ అభిమానిని ఓదారుస్తూ కనిపించారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. తమ జట్టు ఓడి పోవడంతో బాధలో ఉన్న అభిమానిని రణవీర్ సింగ్ ఓదారుస్తున్నట్లు అందులో ఉంది.

    మీకు మరోసారి ఛాన్స్ ఉంటుంది, బాధపడకండి

    ‘‘ఇక్కడ ప్రతి ఒక్కరికీ మరో ఛాన్స్ అనేది ఉంటుంది, ఈ ఓటమితో నిరుత్సాహ పడకండి, వారు చాలా బాగా ఆడారు, వారు కమిట్మెంటుతో, డెడికేషన్‌తో ఉన్న ప్రొఫెషనల్స్... ఇపుడు వారు వెనకబడినా మళ్లీ తప్పకుండా పుంజుకుంటారు'' అంటూ పాకిస్థాన్ అభిమానిని రణవీర్ సింగ్ ఓదార్చారు.

    తన సినిమా ప్రమోషన్ కోసమే...

    తన సినిమా ప్రమోషన్ కోసమే...

    ప్రస్తుతం రణవీర్ సింగ్ 83 అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా తొలిసారి 1983లో వన్డే వరల్డ్ కప్ సాధించిన అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసమే రణవీర్ సింగ్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో సందడి చేశారు.

    83

    83

    ‘83' చిత్రానికి కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు. భార్య పాత్రలో దీపిక పదుకొన్ నటిస్తుండటం విశేషం. అనిల్ ధీరూబాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 10, 2020లో హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రణవీర్ సంగ్, కబీర్ ఖాన్ ఇద్దరికీ ఇది తొలి త్రిభాషా చిత్రం.

    English summary
    Actor Ranveer Singh seen in a new video consoling a Pakistani fan post the India vs Pakistan match that took place on Sunday. Ranveer can be seen giving the disappointed fan a warm hug and telling him, “There is always a next time. Don’t be disheartened, they played well, they are committed, dedicated professionals and they will be back.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X