3000 కోట్ల టార్గెట్‌పై రణ్‌వీర్ సింగ్.. షారుక్ రికార్డుపై గురిపెట్టిన ధురంధర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తన సినిమా కెరీర్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. 2025 నుంచి ఇప్పటి వరకు టాప్ బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టిన హీరోల జాబితాల చేరిపోయాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి ఖాన్ త్రయాల రికార్డులను తడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన కెరీర్‌లో ఏడాది కాలంలో 3000 కోట్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. రణ్‌వీర్ సింగ్ నటించిన సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రణ్‌వీర్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. గతంలో ఆయన నటించిన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ భాయ్ చిత్రాలు హిట్‌గా నిలిచాయి. ఆయనను హిందీ సినిమా చరిత్రలో స్టార్ హీరోగా నిలిపాయి. కలెక్షన్ల పరంగానే కాకుండా నటుడిగా ఓ మెట్టు ఎక్కించాయి. ఇటీవల ఆయన నటించిన జయేష్‌భాయ్ జోర్దార్, సర్కస్ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే వాటి ఫలితాలతో నిరూత్సాహపడలేదు.

Shah Rukh Khan Vs Ranveer Singh

బాలీవుడ్‌లో రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీతో హిట్ అందుకొన్నాడు. ఆ తర్వాత సింగ్ అగైన్ సినిమాతో సక్సెస్ తన ఖాతాలో వేసుకొన్నాడు. ఆ వెంటనే వచ్చిన ధురంధర్ సినిమాతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల పంజాను విసిరాడు. ప్రస్తుతం ధురంధర్ ది రివేంజ్ సినిమాతో ప్రభంజనాన్ని వసూళ్ల రూపంలో కొనసాగిస్తున్నాడు.

రణ్‌వీర్ తన కెరీర్‌లో ఏడాది కాలంలో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ధురంధర్ చిత్రంతో 1350 కోట్ల రూపాయలు తన సినిమా ద్వారా రణ్‌వీర్ సంపాదించాడు. ఇక ధురంధర్ ది రివెంజ్ మూవీతో ఇప్పటికే 1100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. దాంతో ఆయన ఫైనాన్షియల్ ఇయర్‌లో 2500 కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు. ఇంకా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడాది కాలంలో ఆయన ఖాతాలో 3000 కోట్ల రూపాయలు నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటి వరకు బాలీవుడ్‌లోను, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సింగిల్ ఇయర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ఓ రికార్డు షారుక్ ఖాన్‌పై ఉంది. ఆయన పఠాన్ సినిమా ద్వారా 1055 కో ట్లు, జవాన్ చిత్రం ద్వారా 1160 కోట్ల రూపాయలు, డంకీ సినిమా ద్వారా 470 కోట్ల రాబట్టాడు. ఒక సంవత్సర కాలంలో 2600 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన హీరోగా ఓ ఘనతను షారుక్ సొంతం చేసుకొన్నాడు. ప్రస్తుతం షారుక్ రికార్డుపై రణ్‌వీర్ కన్నేశాడు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X