అతనినే పెళ్లి చేసుకుంటా.. ప్రేమ, రిలేషన్ షిప్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్!

నటి రష్మిక అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. కన్నడ కిరిక్ పార్టీ అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ఆమె మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. అయితే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఆమె నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది. అయితే ఈ భామ ఇప్పుడు పెళ్లి గురించి చేసుకోబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు

వరుస హిట్స్

వరుస హిట్స్

'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ప్రేమలో ఉన్నారని

ప్రేమలో ఉన్నారని

ఇక ఆ తరువాత నితిన్‌తో భీష్మతో హిట్ అందుకుని మంచి ఫాంలో ఉన్న ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక పుష్ప సినిమాలో శ్రీ వల్లి పాత్ర చేసిన ఆమె అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తతానికి పుష్ప 2తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది.

ప్రేమలో ఉన్నారని

ప్రేమలో ఉన్నారని


నిజానికి గతంలో రష్మిక, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, ఇద్దరూ అలాంటి వార్తలను ఖండించారు. ఇప్పుడు, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక ప్రేమ మరియు సంబంధాల గురించి మరియు తను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయాల మీద కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రేమ అంటేనే ఫీలింగ్స్

ప్రేమ అంటేనే ఫీలింగ్స్

''నా వరకు ప్రేమ అనేది ఒకరి కొకరు గౌరవం సమయం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, అలాగే ఎవరితో అయితే మనం సెక్యూర్ గా ఫీల్ అవుతామో వారిని మాత్రమే ప్రేమించాలి. అలాగే ప్రేమను వర్ణించడం కష్టం ఎందుకంటే ప్రేమ అంటేనే ఫీలింగ్స్ అని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రేమ ఇరువైపులా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది ఒకరి వైపు నుంచి ప్రేమ ఉండి మరొకరి వైపు నుంచి లేకపోతే అది బాగోదు అని ఆమె చెప్పుకొచ్చింది.

Recommended Video

Allu Arjun Pushpa Breaks RRR Record, Hail Allu Arjun || Filmibeat Telugu
ఏమీ మాట్లాడలేను

ఏమీ మాట్లాడలేను

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడే పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేను, నేను ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదు ఎందుకంటే పెళ్లి చేసుకునే అంత వయసు నాకు రాలేదు అని నేను అనుకుంటున్నాను. కానీ పెళ్లి గురించి మాట్లాడాలంటే ఎవరితో అయితే నేను కంఫర్టబుల్ అని ఫీల్ అవుతామో వాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాను, ఎవరైనా అలాంటి వారిని చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలరు అని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఎప్పుడు పెళ్లి వార్త చెబుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X