అల్లు అర్జున్‌కు కలిసిరావాలని , రష్మిక స్పెషల్ గిఫ్ట్ .. నువ్వు రూల్ చేస్తావంటూ షాకింగ్ పోస్ట్
చిత్ర సీమలో నటీనటుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు నటీనటులు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా ఉంటారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే తన కో స్టార్లకు విందు భోజనాలు పంపించడంతో పాటు తోటలో కాసే మామిడి కాయలు, సీతాఫలాలను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. ఇక చాలా మంది తారలు తమ తోటి నటీనటులకు గిఫ్ట్‌లు పంపి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కిరాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగారు. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్, పుష్ప సినిమాలు రష్మికకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక గతేడాది రిలీజైన యానిమల్‌తో హిందీ జనాలకు మరింత దగ్గరయ్యారు రష్మిక మందన్న.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 1కు ఎంతటి ప్రభంజనం సృష్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప 2పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈవెంట్లు జరగనున్నాయట. టీజర్, ట్రైలర్లు కూడా ఓ రేంజ్‌లో కట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా అద్భుతంగా నటించారు రష్మిక మందన్న. పుష్పతో ఈమె రేంజ్ మారిపోయింది. పుష్ప సిరీస్ కోసం దాదాపు ఐదేళ్లుగా కలిసి పనిచేస్తుండటంతో అల్లు అర్జున్ , రష్మిక మందన్నల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై అభిమానాన్ని చాటుకున్నారు రష్మిక.


ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా అల్లు అర్జున్‌కు ప్రత్యేక కానుక పంపించారు రష్మిక. వెండిని బహుమతిగా అందుకున్న వ్యక్తికి అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ చెప్పారని.. తాను పంపిన వస్తువుతో మీకు మరెంతో అదృష్టం , ప్రేమ దక్కుతాయని బన్నీకి సందేశం పంపారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. థ్యాంక్యూ డియర్, నాకు చాలా అదృష్టం కావాలని రిప్లయ్ ఇవ్వగా, దీనికి రష్మిక మరోసారి రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప రూల్ చేస్తుందని, చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని రష్మిక మందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











