గిఫ్టు ఇచ్చేదాక వదిలిపెట్టను.. అల్లు అర్జున్‌కు రష్మిక స్వీట్ వార్నింగ్
అందాల భామ రష్మిక మందన్న తన పుట్టిన రోజును ఏప్రిల్ 5వ తేదీన ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తించారు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిగా మారింది.
హెబ్బా పటేల్ క్లీవేజ్ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ
పుష్పలో తన సరసన నటిస్తున్న రష్మికకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. భలే మంచి రోజు. ఈ సంవత్సరం మీకు తిరుగులేదు. నీ జీవితంలో ఏమేమి కోరుకొంటున్నావో అవన్నీ తీరాలని నేను కోరుకొంటున్నాను డియర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.

దాంతో నిన్ను ఇలా ఊరికే వదిలిపెట్టను. సెట్లో కలిసినప్పుడు నాతో కలిసి కేక్ కట్ చేసేంత వరకు ఊరుకోను. అంతేకాకుండా నాకు గిఫ్టు కూడా ఇవ్వాలి అంటూ రష్మిక బదులిచ్చింది. రష్మిక కామెంట్‌కు స్పందిస్తూ.. తప్పకుండా.. త్వరలోనే సెట్లో కలుద్దాం అంటూ అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 7వ తేదీన అల్లు అర్జున్ జన్మదినం జరుపుకొంటున్న సంగతి తెలిసిదే.
ఇదిలా ఉండగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హల్‌లో ఆవిష్కరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











