twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సారి తీవ్ర విషాదంలో రవి కిషన్.. మొన్ననే తండ్రి మృతి.. అది మరువక ముందే ఇలా!

    |

    బాలీవుడ్ నటుడు, భోజ్ పురి హీరో టాలీవుడ్ లో అనేక సినిమాల్లో విలన్ గా కనిపించిన రవికిషన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. ఆయన సోదరుడు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.. అయితే అసలు ఏం జరిగింది? రవికిషన్ సోదరుడు కన్ను మూయడానికి కారణాలేమిటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    మద్దాలి శివారెడ్డి పాత్రలో

    మద్దాలి శివారెడ్డి పాత్రలో


    1992 వ సంవత్సరంలో పీతాంబర్ అనే ఒక సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ హిందీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.. హిందీ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో కూడా ఆయన 1999వ సంవత్సరంలో మోనిషా ఎన్ మోనాలిసా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత భోజ్ పురి సినిమాలో ఎంట్రీ ఇచ్చి భోజ్ పురి సినిమా పరిశ్రమలో ఒక హీరోగా నిలబడ్డారు. అక్కడ సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత తెలుగు లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే పాత్రలో నటించి మెప్పించారు.

    తీవ్ర విషాదం

    తీవ్ర విషాదం

    ఆ తర్వాత రవితేజ నటించిన కిక్ 2, సుప్రీమ్, ఒక్క అమ్మాయి తప్ప, రాధా, లై, ఎమ్మెల్యే, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, 90 ఎమ్మెల్, ఇటీవల మహేష్ బాబు మేనల్లుడు హీరోగా తెరకెక్కిన హీరో సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు రవికిషన్. స్వతహాగా సినిమా నటుడే అయినా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం గోరఖ్ పూర్ నుంచి బీజేపీ ఎంపీ గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

    చికిత్స పొందుతూ తుదిశ్వాస

    చికిత్స పొందుతూ తుదిశ్వాస

    గోరఖ్‌పూర్ ఎంపీ, నటుడు రవికిషన్ అన్నయ్య రమేష్ కిషన్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నటుడు రవి కిషన్ స్వయంగా ట్వీట్ చేసి తన సోదరుడి మరణాన్ని తెలియజేశాడు. "విచారకరమైన వార్త.. ఈ రోజు మా అన్నయ్య రమేష్ శుక్లా ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు. ఎంత ప్రయత్నించినా అన్నయ్యను కాపాడలేకపోయారు, తండ్రి తర్వాత అన్నయ్య మృతి చెందడం బాధాకరం. మహాదేవుడు తన పాదాల చెంత నీకు స్థానం ప్రసాదించుగాక. ఓం శాంతి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

    క్యాన్సర్‌తో సహా

    క్యాన్సర్‌తో సహా

    గోరఖ్‌పూర్ ఎంపీ, బాలీవుడ్ నటుడు రవి కిషన్ శుక్లా అన్నయ్య రమేష్ కిషన్ శుక్లా బుధవారం న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. జౌన్‌పూర్ జిల్లాలోని కెరకట్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బిసుయ్ బరాయ్ గ్రామానికి చెందిన ఎంపీ రవి కిషన్ అన్న రమేష్ కిషన్ శుక్లా (52) క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. రమేష్ కిషన్ శుక్లా మృతదేహాన్ని వారణాసికి తీసుకు వెళ్లారు. వారణాసిలోని గంగా ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
    ఉద్వేగానికి లోనై

    ఉద్వేగానికి లోనై

    ముగ్గురు సోదరులలో రమేష్ కిషన్ శుక్లా రెండవవాడు. కొంతకాలంగా బీపీ, కిడ్నీ, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నాడు. అతని చికిత్స ఎయిమ్స్‌లో కొనసాగుతోంది, కానీ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, అతన్ని రక్షించలేకపోయారని చెబుతున్నారు. బుధవారం సాయంత్రం ఎంపీ రవికిషన్‌ తన సోదరుడు రమేష్‌ కిషన్‌ శుక్లా మృతదేహంతో ప్రైవేట్‌ విమానంలో వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుండి బయటకు రాగానే అక్కడ ఉన్న శ్రేయోభిలాషులను చూసి ఉద్వేగానికి లోనైన ఆయన ఏడ్చేశారు.

    English summary
    Ravi Kishan's Elder Brother Ramesh Kishan Dies of Cancer in delhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X