అలా సూసైడ్‌కు ప్రయత్నించా.. ఏదో ఒక రోజు ప్రాణాలు తీసుకొంటా.. జయం రవి షాకింగ్ కామెంట్స్

తమిళంలో స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్‌తో తన బంధం ముగిసిందని సింగర్ కెనీషా ప్రకటించింది. భార్య అరతితో విడిపోయిన తర్వాత కెనీషాతో రవి మోహన్ డేటింగ్ చేయడం తెలిసిందే. అయితే కొద్దికాలంగా వారి సహజీవనం సానుకూలంగా సాగింది. అయితే ఉన్నట్టుండి రవి మోహన్‌తో తెగతెంపులు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను, జయం రవి విడిపోతున్నామని ఇన్స్‌టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చిన ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకొన్నారు. అంతేకాకుండా ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులు తట్టుకోలేక చెన్నై నుంచి కూడా వెళ్లిపోతున్నట్టు ఆమె స్పష్టం చేసింది.

ఈ క్రమంలో రవి మోహన్ మీడియా సమావేశం పెట్టి ఎమోషనల్‌గా బరస్ట్ అయ్యారు. ఆయన భావోద్వేగానికి లోనవ్వడమే కాకుండా కంటతడి పెట్టుకొన్నారు. అంతేకాకుండా ఆగ్రహంతో ప్రెస్ మీట్‌లో ఊగిపోయారు. ఈ సందర్భంగా ఆయన రకరకాల ఎమోషన్స్‌తో మాట్లాడుతూ..

Ravi Mohan broke down

నా మాజీ భార్య ఆరతి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంది. నన్ను పెళ్లి చేసుకోమని ఆమె తన చేయిని కోసుకొని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ బాధ, ఒత్తిడి భరించలేక నేను ఆమెను పెళ్లి చేసుకొన్నాను. ఆ రోజు నుంచి నరకాన్ని చూశాను. విడిపోయిన తర్వాత కూడా నన్ను ఆన్‌లైన్, సోషల్ మీడియాలో వేధిస్తున్నారు అని మీడియా ముందు రవి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను చాలా రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ బాధను తట్టుకోలేక నాకు నేను తీవ్రంగా గాయపరుచుకొన్నాను. కావాలంటే నా చేయిని మీరే చూడండి. నా చేతి నరాలను కోసుకొన్న గీతలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఏదో ఓక రోజు నేను చనిపోవడం ఖాయం. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయే ముందు ప్రతీ ఒక్కరి జీవితంలో శాంతిని హరిస్తాను అని రవి మోహన్ ఆవేశంగా మాట్లాడారు.

నా వ్యక్తిగత జీవితంపై తీరని మచ్చ పడింది. నా పర్సనల్ లైఫ్‌ క్లీన్ అని నిరూపించుకొనేంత వరకు నేను యాక్టింగ్‌కు దూరంగా ఉంటాను. సినిమాల్లో నటించను. అప్పటి వరకు నా సినిమాలను రిలీజ్ చేయను. నా ప్రతిష్టను నేను కాపాడుకొంటాను. ఆ తర్వాతే నేను మళ్లీ నటిస్తాను. అప్పటి వరకు నా సినిమాలు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొంటాను అని రవి మోహన్ స్పష్టం చేశారు.

సినిమా రంగంలోను, సమాజంలోను ఎంతో మంది సెలబ్రిటీలకు విడాకులు అవుతున్నాయి. కానీ నా విడాకుల విషయమే చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే డబ్బు ప్రభావం కారణంగానే అది జరుగుతుంది. నేను అందరి మాదిరిగా డబ్బు ఖర్చు పెట్టలేను. పబ్లిసిటీ కోసం, మీడియా హైప్ కోసం అడ్డదారులు తొక్కలేను అని రవి మోహన్ అన్నారు.

Read more about: jayam ravi aarthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X