మరోసారి కిక్ కాంబో.. రవితేజ ఎందుకు రిస్క్ చేస్తున్నాడు?

మాస్ మహారాజా రవితేజ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. రాజా ది గ్రేట్ సినిమా తరువాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా వరుస అపజయాలు దెబ్బకొట్టాయి. గత ఏడాది శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో అయినా హిట్ కొడదామని అనుకున్న రవితేజ ఆ సినిమాతో కూడా మరో అపజయాన్ని చూడక తప్పలేదు. అయితే ఇప్పుడు సక్సెస్ లేని మరొక దర్శకుడిని కూడా రవితేజ బాగా నమ్ముతున్నాడట.

అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే ప్లాప్ సినిమాను తెరకెక్కించిన వక్కంతం వంశీ వీలైనంత త్వరగా మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. వంశీ అంధించిన చాలా కథకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఈ రైటర్ కమ్ డైరెక్టర్ రవితేజతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో రవితేజ నటించిన కిక్, కిక్ 2 సినిమాలకు వంశీ కథలు అంధించాడు. ఇకపోతే మొన్నటివరకు బన్నీ దగ్గర ఉంటూ గీత ఆర్ట్స్ లో కథలపై చర్చలు జరుపుతున్న వంశీ బన్నీతోనే మరొక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.

Ravi teja another movie with kick writer vakkantham vamsi

కానీ ఇప్పుడు అతనితో కాదని మళ్ళీ రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని లాక్ డౌన్ ముగిసిన తరువాత వక్కంతం వంశీ రవితేజకు కిక్ లాంటి మరోక హిట్ ఇవ్వడం గ్యారెంటీ అని టాక్ వస్తోంది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X