ఆసక్తిరేకెత్తిస్తున్న రవితేజ కొత్తచిత్రం.. తండ్రీకొడుకులుగా!
రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శత్వంలో నటిస్తున్నాడు. అమర్ అక్బర్ ఆంటోని చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై ఆసక్తిని రేకెత్తించింది. రవితేజ ఈ చిత్రంలో మూడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా రవితేజ తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తరువాత రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడట. తండ్రీకొడుకులుగా రవితేజ నటించబోతున్నట్లు తెల్సుతోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి విభిన్న చిత్రాల్ని విఐ ఆనంద్ తెరకెక్కించారు.

రవితేజ చిత్రాన్ని ఎలాంటి కథతో తీయబోతున్నారో వేచి చూడాలి. ఇదిలా ఉండగా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం అక్టోబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











